జనవరి నాలుగో వారం మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోంది. ఒకవైపు థియేటర్లలో ‘బోర్డర్ 2’ వంటి భారీ చిత్రాలు సందడి చేస్తుంటే.. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ కూడా సూపర్ హిట్ సినిమాలతో పోటీ పడుతున్నాయి. ఈ రాత్రి (జనవరి 23) నుండి స్ట్రీమింగ్ కాబోతున్న ఆ క్రేజీ సినిమాల లిస్ట్ ఇదీ:
- ధనుష్ – కృతి సనన్ ‘తేరే ఇష్క్ మే’ (Netflix)
ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్యూర్ లవ్ స్టోరీ థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. ధనుష్ నటన, కృతి సనన్ గ్లామర్ ఈ సినిమాకు హైలైట్.
- కిచ్చా సుదీప్ ‘మార్క్’ (Jio Hotstar)
కన్నడ సూపర్ స్టార్ సుదీప్ నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘మార్క్’. డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు.
- ఉపేంద్ర – శివరాజ్ కుమార్ ‘45’ (Zee5)
కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు దిగ్గజాలు ఉపేంద్ర మరియు శివరాజ్ కుమార్ కలిసి నటించిన సెన్సేషనల్ మూవీ ’45’. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ రాత్రి నుండి జీ5 (Zee5) లో అందుబాటులోకి రానుంది.
- శోభిత ధూళిపాళ ‘చీకటిలో’ (Prime Video)
అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘చీకటిలో’. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
- రోషన్ మేకా ‘ఛాంపియన్’ (Netflix)
శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ ఈ రాత్రి నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న ఇతర సినిమాలు:
శంభాల (తెలుగు): ఆహా (Aha) లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది.
సిరై (తమిళ కోర్టు రూమ్ డ్రామా): జీ5 (Zee5) లో జనవరి 23 నుండి అందుబాటులో ఉంటుంది.

