టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్నా కొన్నిసార్లు అదృష్టం కలిసిరాదు అనడానికి ఐశ్వర్యా రాజేష్ తాజా పరిస్థితే నిదర్శనం. గత ఏడాది విక్టరీ వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ తెలుగు అమ్మాయి, ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సుమారు రూ. 250 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగమైనా, తనకు అవకాశాలు రాకపోవడంపై ఆమె ఓపెన్ అయిపోయింది.

పెద్ద హీరోలు నన్ను నమ్మడం లేదు!

రీసెంట్ ఇంటర్వ్యూలో ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ తన మనసులోని బాధను బయటపెట్టింది. “వెంకటేష్ సార్‌తో చేసిన సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక, టాలీవుడ్ సీనియర్ హీరోల నుండి నాకు వరుస ఆఫర్లు వస్తాయని ఆశించాను. కానీ దాదాపు ఏడాది గడిచినా ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కూడా రాలేదు. బహుశా నా నటన మీద, నా కేపబిలిటీస్ మీద ఇంకా మన టాప్ హీరోలకు, డైరెక్టర్లకు అనుమానాలు ఉన్నాయేమో!” అంటూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడింది.

గ్లామర్ లేదనా? టాలెంట్ సరిపోలేదా?

తమిళంలో విలక్షణమైన పాత్రలతో తన నటనను నిరూపించుకున్న ఐశ్వర్యా, గ్లామర్ హీరోయిన్ల మూసలో ఇమడదు అన్నది ఇండస్ట్రీ టాక్. అయితే కేవలం గ్లామర్ మాత్రమే చూసి ఆమె టాలెంట్‌ను పక్కన పెడుతున్నారా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ప్రస్తుతం ఈమె చేతిలో కేవలం యంగ్ హీరో తిరువీర్ సరసన ఒక్క సినిమా మాత్రమే ఉంది.

తెలుగు అమ్మాయికి తప్పని కష్టాలు..

చెన్నైలో పెరిగిన తెలుగు అమ్మాయిగా, సొంత భాషలో రాణించాలని ఐశ్వర్యా ఎంతో కాలంగా ఎదురుచూస్తోంది. కానీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు చూసినా, టాప్ స్టార్ల సరసన ఆమెకు ఇంకా బ్రేక్ దొరకకపోవడం గమనార్హం.

#Aishwarya Rajesh, #Aishwarya Rajesh Disappointed, #Sankranthiki Vasthunam, #Telugu Movie Offers, #Tollywood

By admin