సినిమా వార్తలు

ఓటీటీలో ‘ధురంధర్’ వచ్చేసింది.. తెలుగులో స్ట్రీమింగ్!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలీవుడ్ మాస్ మూవీ ‘ధురంధర్’ (Dhurandhar) ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లో మిస్ అయిన తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్.

సౌత్ ఆడియెన్స్ కి పండగే!

ఈ సినిమా థియేటర్లలో కేవలం హిందీలోనే రిలీజ్ అయ్యింది. దీంతో మన వాళ్ళు చాలా మంది చూడలేకపోయారు. కానీ నెట్‌ఫ్లిక్స్ లో మాత్రం ఇప్పుడు తెలుగు (Telugu) మరియు తమిళ (Tamil) ఆడియోలో కూడా అందుబాటులోకి తెచ్చారు. దీంతో సౌత్ లో ఈ సినిమాకి భారీగా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఆ ఒక్కటి మార్చలేదు.. థ్యాంక్స్ టు నెట్‌ఫ్లిక్స్!

సాధారణంగా డబ్బింగ్ సినిమాల్లో పాటలు వింటే చిరాకు వస్తుంది. అర్థం పర్థం లేని లిరిక్స్, చెత్త వోకల్స్ తో పాటని ఖూనీ చేస్తారు. కానీ ‘ధురంధర్’ విషయంలో నెట్‌ఫ్లిక్స్ తెలివైన పని చేసింది. ఈ సినిమాలో చార్ట్ బస్టర్ గా నిలిచిన ఒరిజినల్ హిందీ పాటలనే (Original Hindi Songs) తెలుగు వెర్షన్ లో కూడా అలాగే ఉంచేశారు.

డబ్బింగ్ పాటలతో సినిమా ఫీల్ చెడగొట్టకుండా, ఒరిజినల్ సాంగ్స్ ని వాడటంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సో.. మంచి క్వాలిటీతో, సూపర్ సాంగ్స్ తో ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో చూసి ఎంజాయ్ చేయొచ్చు!

ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ‘ధురంధర్’ ఉందా? అయితే వెంటనే నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేయండి!

Similar Posts