సినిమా వార్తలు

మెగాస్టార్‌కు నచ్చని హీరోయిన్లు వీళ్లేనా? శ్రీదేవి మాత్రమే బెస్ట్ ఎందుకు? చిరంజీవి షాకింగ్ కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవి అంటేనే డ్యాన్స్, గ్రేస్. ఏడు పదుల వయసులో కూడా తన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశారు. అయితే, తన కెరీర్‌లో 60 మందికి పైగా హీరోయిన్లతో నటించిన చిరు, తాజాగా కొంతమంది హీరోయిన్ల ప్రవర్తనపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

పర్సనల్ కంఫర్ట్ అవసరం లేదు! ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మిల్కీ బ్యూటీ తమన్నా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. హీరోయిన్ల విషయంలో తనకు ‘పర్సనల్ కంఫర్ట్’ అస్సలు అవసరం లేదని చిరంజీవి స్పష్టం చేశారు. “నేను కేవలం ప్రొఫెషనల్ కంఫర్ట్ మాత్రమే చూస్తాను. ప్రొఫెషనల్‌గా బెస్ట్ అనిపించిన వాళ్లు నాకు ఇష్టం” అని చిరు చెప్పుకొచ్చారు.

పోటీ పడితే నాకు చిరాకు.. డ్యాన్స్ సాంగ్స్ షూటింగ్ సమయంలో కొంతమంది హీరోయిన్లు చేసే పని తనకు నచ్చదని చిరు ఓపెన్ అయ్యారు. “కొంతమంది హీరోయిన్లు సాంగ్ చేసేటప్పుడు నాతో పోటీ పడుతున్నట్లు డ్యాన్స్ చేస్తారు. దానిని ఒక కాంపిటీషన్‌గా భావిస్తారు. అలాంటి వాళ్లు నాకు నచ్చరు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రియల్ లవర్స్ లా ఉండాలి! హీరో హీరోయిన్లు తెరపై డ్యాన్స్ చేస్తున్నప్పుడు వారి మధ్య లయబద్ధత ఉండాలని మెగాస్టార్ అభిప్రాయపడ్డారు. “సాంగ్ చూస్తున్నప్పుడు ఆడియన్స్‌కు వీరు నిజమైన ప్రేమికులు (Real Lovers) అనే ఫీలింగ్ కలగాలి. అలా చేసే హీరోయిన్లే నాకు ఇష్టం. ఈ విషయంలో శ్రీదేవి ఎప్పుడూ ది బెస్ట్” అని చిరంజీవి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన తన రీసెంట్ హిట్ తర్వాత వింటేజ్ మెగాస్టార్‌ను చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ ‘కాంపిటీషన్’ హీరోయిన్లు ఎవరా అని ఇప్పుడు నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

Similar Posts