
Ranveer Singh: రణ్‌వీర్ సింగ్‌కు చుక్కలు చూపిస్తున్న నిర్మాత! 40 కోట్లు కట్టాల్సిందే అంటూ డెడ్‌లైన్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) చుట్టూ ఇప్పుడు వివాదాల ముసురు ముదురుతోంది. ఒకవైపు ‘ధురంధర్’ (Dhurandhar) సినిమాతో 1300 కోట్ల వసూళ్లు రాబట్టి ఫుల్ జోష్‌లో ఉన్న రణ్‌వీర్‌కు, తాజాగా ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఊహించని షాక్ ఇచ్చారు. ప్రాజెక్ట్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నందుకు ఏకంగా రూ. 40 కోట్ల భారీ జరిమానా చెల్లించాలంటూ డెడ్‌లైన్ విధించడం బీ-టౌన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
డాన్ 3 నుంచి రణ్‌వీర్ అవుట్? నిర్మాత ఆగ్రహం!
వివరాల్లోకి వెళితే.. షారుఖ్ ఖాన్ తర్వాత ‘డాన్’ (Don) సిరీస్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను రణ్‌వీర్ సింగ్‌కు అప్పగించారు దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్ (Farhan Akhtar). ‘డాన్ 3’ (Don 3) కోసం గత మూడేళ్లుగా ప్రి-ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ వర్క్, లొకేషన్ల ఎంపిక కోసం ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ భారీగా ఖర్చు చేసింది. తీరా షూటింగ్ మొదలవ్వాల్సిన సమయంలో రణ్‌వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఫర్హాన్ అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
ఖర్చులన్నీ నువ్వే కట్టాలి.. ఫర్హాన్ డిమాండ్!
కేవలం రణ్‌వీర్‌ను నమ్ముకుని మూడేళ్ల సమయం, కోట్ల రూపాయల డబ్బు వృథా చేశామని నిర్మాత వాదిస్తున్నారు. రణ్‌వీర్ తప్పుకోవడం వల్ల జరిగిన నష్టానికి పరిహారంగా రూ. 40 కోట్లు కట్టాల్సిందేనని బీ-టౌన్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై రణ్‌వీర్ ఇంకా స్పందించాల్సి ఉంది.
కాంతార వివాదం.. కేరవాన్ల రచ్చ!
ఇక రణ్‌వీర్ చుట్టూ ఉన్న వివాదాలు ఇక్కడితో ఆగలేదు. ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) లోని ఒక దైవ సన్నివేశాన్ని హేళన చేశారనే ఆరోపణలతో ఇప్పటికే కోర్టు కేసు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 8న దీనిపై విచారణ జరగనుంది. మరోవైపు, ‘ధురంధర్’ షూటింగ్ సమయంలో తన కోసం, తన స్టాఫ్ కోసం ఏకంగా 3 వానిటీ వాన్లను నిర్మాతల నుంచి పొంది విలాసవంతమైన డిమాండ్లు చేశారని నెటిజన్లు ఆయనపై విరుచుకుపడుతున్నారు
