
భక్తి ప్లేస్ లో బొడ్డు,పూలు, పండ్లు? ఇప్పటికి తిట్టిపోస్తున్నారు
నందమూరి బాలకృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర హిట్లు, రికార్డుల సునామీ. కానీ వీరిద్దరి కాంబోలో వచ్చిన ఒక భక్తిరస చిత్రం మాత్రం ఇండస్ట్రీ హిట్ కావాల్సింది పోయి, అతి పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీనికి కారణం మరేదో కాదు, రాఘవేంద్రరావుకు ఉన్న గ్లామర్ పిచ్చి, శ్రుతి మించిన రొమాన్స్. భక్తి ఉండాల్సిన చోట బూతును జోడించడం వల్ల ఒక గొప్ప సినిమా ఎలా బూడిదలో పోసిన పన్నీరైందో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

భక్తి కథలో టబుతో రొమాన్స్.. ఆడియన్స్‌కు మైండ్ బ్లాక్!
సీనియర్ ఎన్టీఆర్ నటించిన క్లాసిక్ ‘పాండురంగ మహత్యం’ స్ఫూర్తితో 2008లో ‘పాండురంగడు’ సినిమాను తెరకెక్కించారు. బాలయ్య శ్రీకృష్ణుడిగా, పుండరీక రంగనాథుడిగా ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ థియేటర్లోకి వెళ్ళిన జనాలు షాక్ అయ్యారు. భక్తిరస చిత్రమని వెళ్తే, అక్కడ టబుతో బాలయ్య చేసిన రొమాన్స్ చూసి తల పట్టుకున్నారు. సాధారణంగా రాఘవేంద్రరావు కమర్షియల్ సినిమాల్లో వాడే పూలు, పండ్లు, హీరోయిన్ నాభి ప్రదర్శనను ఈ భక్తి చిత్రంలో కూడా రెట్టింపు స్థాయిలో చూపించారు.

హిట్ అవ్వాల్సిన మూవీని పాతాళానికి తొక్కేసిన వైనం!
సినిమాలో పుండరీక రంగనాథుడు వేశ్య మోజులో పడే సన్నివేశాలను రాఘవేంద్రరావు మరీ పచ్చిగా తీశారని అప్పట్లో భారీ విమర్శలు వచ్చాయి. భక్తుడి కథను పక్కన పెట్టి, కేవలం రొమాన్స్ మీద దృష్టి పెట్టడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు చూడటమే మానేశారు. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ వంటి హిట్లలో ఉన్న పద్ధతి ఈ సినిమాలో మిస్ అయ్యింది. వరుస పరాజయాల్లో ఉన్న బాలయ్యకు ఈ సినిమా సంజీవనిలా మారుతుందని భావిస్తే, దర్శకుడి అతి ఉత్సాహం వల్ల అది కాస్తా కెరీర్లోనే ఒక మచ్చలా మిగిలిపోయింది.
ఒక అద్భుతమైన భక్తి కథను రొమాంటిక్ మసాలాగా మార్చడం వల్లే ‘పాండురంగడు’ డిజాస్టర్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు ఇప్పటికీ చర్చించుకుంటుంటాయి. దర్శకుడి తీరు వల్ల బాలయ్యకు రావాల్సిన ఒక భారీ సక్సెస్ చేజారిపోయింది. మరి ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో చేస్తున్న NBK111 విషయంలోనైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా, పక్కా మాస్ ఎలివేషన్లతో బాలయ్య బాక్సాఫీస్‌ను ఊచకోత కోయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
