2023లో విడుదలైన సినిమాలకు సంబంధించిన జాతీయ సినిమా అవార్డులు ప్రకటించబడ్డాయి. ఇందులో తెలుగు ప్రేక్షకులను గర్వపడేలా చేసిన చిత్రం “భగవంత్ కేసరి” – ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ఎంపికైంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, బాలిక విద్య, ఆమె ఆత్మవిశ్వాసం, అలాగే ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ వంటి సున్నితమైన సామాజిక అంశాలపై దృష్టిపెట్టి జ్యూరీ మెప్పును సంపాదించింది. జ్యూరీ చైర్మన్ అశుతోష్ గోవారికర్ తెలిపిన ప్రకారం, ఈ అవార్డు ఎంపికకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఓకే చెప్పారు. వాణిజ్య పరంగా మోస్తరు విజయాన్ని సాధించిన “భగవంత్ కేసరి”, ఇప్పుడు తమిళంలో విజయ్ హీరోగా “జన నాయకన్” పేరుతో రీమేక్ అవుతోంది.

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (71th National Film Awards-2023) కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘12th ఫెయిల్‌’కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. షారుక్‌ ఖాన్‌ (జవాన్‌), విక్రాంత్‌ మస్సే (12th ఫెయిల్‌)లు ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా ‘మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’ (హిందీ)లో నటనకు రాణీ ముఖర్జీని అవార్డు వరించింది.’

ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరిని అవార్డు వరించింది. ఉత్తమ తమిళ చిత్రంగా ‘పార్కింగ్‌’కు అవార్డు దక్కింది. బెస్ట్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌ అవార్డు ఉత్పల్‌ దత్త (అస్సామీ)కు ప్రకటించారు.
జాతీయ చలన చిత్ర అవార్డులు ఫీచర్‌ ఫిల్మ్‌

ఉత్తమ మ్యూజిక్‌ దర్శకత్వం; వాతి (తమిళ్‌) జీవీ ప్రకాశ్‌ కుమార్‌
ఉత్తమ సంగీతం (నేపథ్యం): యానిమల్‌: హర్షవర్థన్‌ రామేశ్వర్‌:
బెస్ట్‌ మేకప్‌: సామ్‌ బహూదర్‌ (హిందీ) శ్రీకాంత్‌దేశాయ్‌
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సామ్‌ బహదూర్‌ (హిందీ)
బెస్ట్‌ప్రొడక్షన్‌ డిజైన్‌: 2018 - ఎవ్రీ వన్‌ ఈజ్‌ ఏ హీరో (మలయాళం) మోహన్‌దాస్‌
బెస్ట్‌ ఎడిటింగ్‌: పూక్కాలమ్‌ (మలయాళం) మిధున్‌ మురళి
బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: యానిమల్‌ (హిందీ) సచిన్‌ సుధాకరన్‌, హరి హరన్‌ మురళీ ధరన్‌
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): బేబీ (తెలుగు) సాయి రాజేశ్‌ నీలం
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): పార్కింగ్‌ (తమిళ్‌) రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌
ఉత్తమ సంభాషణలు: సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై (హిందీ) దీపక్‌ కింగ్రానీ
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ది కేరళ స్టోరీ (హిందీ): పసంతను మొహపాత్రో
ఉత్తమ నేపథ్య గాయని: జవాన్‌ (చెలియా) శిల్పారావు
ఉత్తమ నేపథ్య గాయకుడు: బేబీ( పీవీన్‌ ఎస్‌ రోహిత్‌)
బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: గాంధీతాత చెట్టు (సుకృతివేణి), జిప్సీ (మరాఠీ) కబీర్‌ ఖండారీ, నాల్‌ 2 (మరాఠీ) త్రిష థోసర్‌, శ్రీనివాస్‌ పోకలే, భార్గవ్‌ జగ్దీప్‌
ఉత్తమ సహాయ నటి: ఉల్లుకు (మలయాళం) ఊర్వశి, వష్‌ (గుజరాతీ) జానకీ బోడివాలా
ఉత్తమ సహాయ నటుడు: పూక్కాలం (మలయాళం)  విజయ రాఘవన్‌,, పార్కింగ్‌ (తమిళ్‌) ముత్తుపెట్టాయ్‌ సోము భాస్కర్‌
ఉత్తమ నటి: మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే (హిందీ):రాణీ ముఖర్జీ
ఉత్తమ నటుడు: జవాన్‌ (హిందీ) షారుక్‌ఖాన్‌, 12th ఫెయిల్‌ (హిందీ) విక్రాంత్‌ మస్సే
ఉత్తమ దర్శకత్వం: ది కేరళ స్టోరీ (హిందీ) సుదీప్తో సేన్‌
ఉత్తమ యానిమేషన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ మూవీ: హనుమాన్‌ (తెలుగు)
ఉత్తమ బాలల చిత్రం: నాల్‌ (మరాఠీ)
ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రం:  సామ్‌ బహదూర్‌ (హిందీ)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం: రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ (హిందీ)
ఉత్తమ పరిచయ దర్శకుడు: ఆత్మపాంప్లెట్‌ (మరాఠీ)  ఆశిష్‌ బెండే
ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌: 12 ఫెయిల్‌
నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ కేటగిరి
స్పెషల్‌ మెన్షన్‌ చిత్రాలు
నేకల్‌: క్రానికల్‌ ఆఫ్‌ ప్యాడీ మ్యాన్‌ (మలయాళం)
ది సీ అండ్‌ సెవెన్‌ విలెజెస్‌ (ఒడియా)
బెస్ట్‌ స్క్రిప్ట్‌: సన్‌ ఫ్లవర్స్‌ వోర్‌ ది ఫస్ట్‌ వన్స్‌ టు నో (కన్నడ)
బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: ది సేక్రెడ్‌ జాక్‌ - ఎక్స్‌ప్లోరింగ్‌ ది ట్రీస్‌ ఆఫ్‌ విషెస్‌ (ఇంగ్లీష్‌)
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: ది ఫస్ట్‌ ఫిల్మ్‌ (హిందీ)
బెస్ట్‌ ఎడిటింగ్‌: మూవీంగ్‌ ఫోకస్‌ (ఇంగ్లీష్‌)
బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: దుందగిరి కే ఫూల్‌ (హిందీ)
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: లిటిల్‌ వింగ్స్‌ (తమిళ్‌)
బెస్ట్‌ డైరెక్షన్‌: ది ఫస్ట్‌ ఫిల్మ్‌ (హిందీ)
బెస్ట్‌ ఎడిటింగ్‌: మూవీంగ్‌ ఫోకస్‌ (ఇంగ్లీష్‌)
బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: దుందగిరి కే ఫూల్‌ (హిందీ)
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: లిటిల్‌ వింగ్స్‌ (తమిళ్‌)
బెస్ట్‌ డైరెక్షన్‌ : ది ఫస్ట్‌ ఫిల్మ్‌ (హిందీ)
బెస్ట్‌ ఆర్ట్స్‌/కల్చర్‌ ఫిల్మ్‌: టైమ్‌లెస్‌ తమిళనాడు (ఇంగ్లీష్‌)
బెస్ట్‌ బయోగ్రాఫికల్‌ ఫిల్మ్‌: మా బావు, మా గావ్‌ (ఒడిశా), లెంటినో ఓవో ఏ లైట్‌ ఆన్‌ ది ఈస్ట్రన్‌ హారిజాన్‌ (ఇంగ్లీష్‌
ఉత్తమ పరిచయ దర్శకుడు: మావ్‌: ది స్పిరిట్‌ డ్రీమ్స్‌ ఆఫ్‌ చెరా (మిజో
బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ప్లవరింగ్‌ మ్యాన్‌ (హిందీ)


, , , , , , , ,
You may also like
Latest Posts from