తెలుగు

ఒక్క రోజుకు అన్ని కోట్లా? ఎన్టీఆర్ – నీల్ ‘డ్రాగన్’ షాకింగ్ బడ్జెట్ వివరాలు లీక్!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే వార్త ఇది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో విధ్వంసం సృష్టించబోతుందో చెప్పడానికి ఈ ఒక్క లెక్క చాలు. మేకర్స్ ఖర్చు పెడుతున్న తీరు చూస్తుంటే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ యాక్షన్ స్పెక్టాకిల్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే..

ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా జోర్డాన్ దేశంలో జరిగింది. అక్కడ చిత్రీకరించిన విజువల్స్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ పెట్టిన ఖర్చు వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. నిర్మాత నవీన్ యెర్నేని స్వయంగా వెల్లడించిన దాని ప్రకారం, జోర్డాన్ షెడ్యూల్‌లో కేవలం ఒక్క రోజు ప్రొడక్షన్ ఖర్చే సుమారు 1.5 కోట్ల రూపాయలు. గ్రాండ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఎక్కడా రాజీ పడకుండా నీల్ ఈ ప్రాజెక్టును చెక్కుతున్నారు.

పాన్-ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరల పెంపు అనేది అనివార్యమని, క్వాలిటీ అవుట్‌పుట్ కోసం ఇంత భారీగా వెచ్చించాల్సి వస్తోందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వెంచర్, థియేటర్లలో విజువల్ ఫీస్ట్‌గా ఉండబోతోంది.

Similar Posts