ప్రతీ హీరోకు ఒక డ్రీమ్ ఉంటుంది.. ఫలానా డైరెక్టర్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని జీవితాశయం ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కూడా అలాంటి ఒక తీరని కోరిక ఉందన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ స్టార్ డైరెక్టర్ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా దశాబ్ద కాలం ఎదురుచూశారంటే నమ్ముతారా?
నందమూరి మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, తన నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ నుండి మొదలైన ఈ ప్రభంజనం ‘RRR’తో ఆస్కార్ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ వంటి భారీ దర్శకులతో పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అయితే కెరీర్ స్టార్టింగ్ నుండి ఎన్టీఆర్ మనసులో ఒకే ఒక డైరెక్టర్ ఉన్నారట, ఆయనతో ఒక్కటంటే ఒక్క సినిమా చేయాలని ఎంతో తపించారు. కానీ విధి ఆ కాంబినేషన్‌ను ఇప్పటివరకు సెట్ చేయలేదు. ఇంతకీ ఎన్టీఆర్ ఆశపడ్డ ఆ ‘కలల దర్శకుడు’ మరెవరో కాదు.. కోలీవుడ్ దిగ్గజం శంకర్!

శంకర్ మ్యాజిక్ కోసం ఎన్టీఆర్ కసరత్తు:
భారీతనం, సామాజిక సందేశం కలగలిపి సినిమాలు తీయడంలో శంకర్ స్టైలే వేరు. ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్లలో శంకర్ సినిమాలకు ఉన్న క్రేజ్ చూసి, ఆయన దర్శకత్వంలో నటించాలని తీవ్రంగా ప్రయత్నించారట. శంకర్ కూడా ఎన్టీఆర్ లాంటి పవర్ హౌస్ పర్ఫార్మర్‌తో పని చేయాలని అనుకున్నా, డేట్స్ కుదరక ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దాదాపు పదేళ్ల పాటు ఈ కాంబో గురించి చర్చలు నడిచినా ఫలితం లేకుండా పోయింది.

గేమ్ చేంజర్ ఎఫెక్ట్.. ఇప్పుడు వద్దనుకుంటున్నారా?
ఒకప్పుడు శంకర్ అంటే మినిమం గ్యారెంటీ, కానీ ఇప్పుడు సీన్ మారింది. గత ఏడాది రామ్ చరణ్‌తో చేసిన ‘గేమ్ చేంజర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. శంకర్ పాత మ్యాజిక్ ఇప్పుడు పని చేయడం లేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కూడా ఇప్పుడు శంకర్‌తో రిస్క్ చేయడం కంటే, ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్లతో బిజీగా ఉండటమే బెటర్ అని భావిస్తున్నారట. ఒకప్పుడు ప్రాణం పెట్టి ఎదురుచూసిన ఎన్టీఆర్, ఇప్పుడు శంకర్ ఫామ్ చూసి లైట్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్.
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా కోసం డిఫరెంట్ మేకోవర్‌లో కనిపిస్తూ ప్రభంజనం సృష్టించడానికి రెడీ అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో శంకర్‌తో చేయలేకపోయాననే చిన్న వెలితి ఉన్నా, ఇప్పుడు తన మార్కెట్ రేంజ్ మారడంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో శంకర్ మళ్ళీ తన ఫామ్ అందుకుంటే ఈ క్రేజీ కాంబోను చూడవచ్చునేమో! మరి ఈ కాంబినేషన్ సెట్ అయితే చూడాలని మీరు కోరుకుంటున్నారా?

