చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ప్రస్తుతం చిరంజీవిపై ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేసారు. ఈ పాటకు శోబి మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అందుతున్న సమచారం మేరకు , మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అతిధి పాత్రలో కనిపిస్తాడు మరియు అతను ఈ రోజు సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యాడు.

సాయిధరమ్ తేజ్ ఇంట్రడక్షన్ సాంగ్‌లో మెగాస్టార్‌తో కాలు కలిపి డాన్స్ చేయనున్నారు. ఇది MM కీరవాణి కంపోజ్ చేసిన అవుట్ అండ్ అవుట్ మాస్ నంబర్. మార్చిలోపు షూటింగ్ పార్ట్‌లు పూర్తి చేసి, ‘విశ్వంభర’ని సమ్మర్ తర్వాత విడుదల చేయాలని భావిస్తున్నారు.

బడ్జెట్‌లో ఎక్కువ భాగం VFX పని కోసం ఖర్చు చేస్తున్నాు. యువి క్రియేషన్స్‌ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం చిరంజీవి సినిమాల్లో అత్యంత ఖరీదైన ప్రయత్నం.

మరో ప్రక్క ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. మేకర్స్ విడుదల తేదీని ఖరారు చేసి త్వరలో ప్రకటించాలని భావిస్తున్నారు.

‘‘చిరంజీవి చరిష్మాటిక్‌ ప్రెజెన్స్ తో ‘విశ్వంభర’ మునుపెన్నడూ లేని ఎక్స్‌పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతోంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్‌ యాక్షన్ సీక్వెన్స్ విజువల్‌ వండర్‌లా ఉండబోతోంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

,
You may also like
Latest Posts from