విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఛావా సినిమా నార్త్ లో ఘనవిజయం సాధించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు కలెక్షన్స్ పరంగాను అదరగొట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లో రూ. 500కోట్లకు పైగా వసూల్ చేసింది ఈ మూవీ. తెలుగు వెర్షన్ బ్రేక్ ఈవెన్ మాత్రం తెచ్చుకోగలుగుతుందని అంటున్నారు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఛావా సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికీ థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 11న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.
చావా చిత్రానికి లక్ష్మణ్ ఉడేకర్ దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిల్మ్స్‌కు చెందిన దినేష్ విజన్ నిర్మించారు.
ఈ చిత్రం శివాజీ సావంత్ మరాఠీ నవల చావా ఆధారంగా రూపొందించారు. బాలీవుడ్ లో దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. మార్చి 7న ఛావా సినిమా తెలుగులోనూ విడుదలైంది.