గత సంవత్సరం భారత ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెహమాన్, ఆయన భార్య సైరా బాను తమ రెండు దశాబ్దాల వివాహ బంధానికి గుడ్‌బై చెప్పారు. అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన మేనల్లుడు సంగీత దర్శకుడు అయిన జీవీ ప్రకాష్ కూడా విడాకులకు అప్లై చేసారు.
2024లోనే విడిపోతున్నట్లు ప్రకటించిన జీవీ. ప్రకాష్- సింగర్ సింగర్ సైంధవి జంట తాజాగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఫ్యామిలీ కోర్టుకు వెళ్లి.. విడాకుల కోసం అర్జీ పెట్టుకున్నారు. దీంతో 12 ఏళ్ళ వీరి వైవాహిక జీవితానికి పూర్తిగా ముగింపు పలికేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రకాష్ తన చిన్ననాటి స్నేహితురాలు సైంధవిని 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి 2020లో పాప పుట్టింది. ఇప్పుడు ఆ పాపకు నాలుగు సంవత్సరాలు ఉన్నాయి. కానీ అనుకోని విధంగా వీరి తమ వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది.
జీవీ ప్రకాష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళ్లో ఇడ్లీ కడై, పరాశక్తి, గుడ్ బ్యాడ్ అగ్లీ, తెలుగులో రాబిన్హుడ్ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు ప్రకాష్ తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు.
డార్లింగ్, రాజారాణి, టైగర్ నాగేశ్వర్ రావు, లక్కీ భాస్కర్ సినిమాలకు మ్యూజిక్ కొట్టారు. తమిళ మూవీ ‘సూరారై పోట్రు’ గానూ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.