మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (Rajamouli) ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.అటవీ నేపథ్యంలో సాగే కథతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు రాజమౌళి.

ఇందులో మహేశ్‌ (Mahesh Babu) మునుపెన్నడూ చేయని ఓ విభిన్నమైన పాత్రలో.. సరికొత్త లుక్‌తో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ఈచిత్రం గురించిన ప్రతీ అప్డేట్ అభిమానులను ఆనందపరుస్తోంది. తాజాగా ఓ కొత్త అప్డేట్ అంటూ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే…

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ (వర్కింగ్‌ టైటిల్‌) రెండు భాగాలుగా రానుందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. రెండు కాదు ఒకటేనని తాజా సమాచారం.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)లాగే నిడివి ఎక్కువైనా ఈ కొత్త చిత్రాన్నీ (SSMB 29) ఒకే పార్ట్‌గా తెరకెక్కించాలని రాజమౌళి నిర్ణయించినట్టు తెలిసింది. సాగదీయకుండా చెప్పాలనుకున్న కథను సూటిగా సుత్తిలేకుండా ఒక్క మూవీతోనే చెప్పబోతున్నారని టాక్‌.

ఎప్పటిలాగే.. ఆసక్తికర ఇంట్రడక్షన్‌, ఉత్కంఠ భరిత ఇంటర్వెల్‌, అదరగొట్టే క్లైమాక్స్‌తో కొత్త స్టోరీని చెప్పనున్నారు. స్పెషల్‌ వీడియోతో త్వరలోనే ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారని సమాచారం.

ఈ అడ్వెంచర్‌ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఒడిశాలో ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తయింది.

, , ,
You may also like
Latest Posts from