ఇప్పటికే ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ (Rocketry: The Nambi Effect)తో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చిన మాధవన్‌ (R Madhavan) ఇప్పుడు మరో బయోపిక్‌తో ప్రేక్షకులను పలకరించనున్నారు.

‘ది ఎడిసన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరుగాంచిన జి.డి.నాయుడు (G D Naidu) బయోపిక్‌లో ఆయన టైటిల్‌ పాత్ర పోషించనున్నారు. ఆయనతో పాటు శివానీ రాజశేఖర్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. జూన్‌ నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారు.

దర్శకుడు కృష్ణకుమార్ రామకుమార్‌ తెరకెక్కించనున్న జీడీ నాయుడు బయోపిక్‌లో ఆర్‌ మాధవన్‌తో పాటు స్క్రీన్‌ షేర్‌ చేసుకోనుంది.

జి.డి.నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయడు. కోయంబత్తూర్‌లో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రయోగాలపై ఆసక్తితో పలు రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు చేశారాయన.

ముఖ్యంగా ఎలక్ట్రికల్‌ ఫీల్డ్‌లో విప్లవం సృష్టించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్‌ మోటార్‌ను రూపొందించింది ఆయనే. మిరాకిల్‌ మ్యాన్‌గానూ ఆయన గుర్తింపు పొందారు. జి.డి.నాయుడు వృత్తిపరమైన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలతో పాటు వ్యక్తిగత జీవితాన్ని ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది.

, , ,
You may also like
Latest Posts from