జాక్ అలియాస్ పాబ్లో నెరుడా (సిద్ధు జొన్నలగడ్డ) తనను తానే జాక్ అని పిలుచుకునే తెలివైన వాడు. జీవితంలో ఏదో ఒకటి పెద్దగా కొట్టాలనేదే అతని ఆశయం. దాంతో అతను ఆడని ఆట లేదు. అది క్రికెట్, వాలిబాల్, టెన్నీస్ ఏదైనా ఆడేస్తాడు. ఎలాగైనా పాడేస్తాడు. అయితే అతనిలో ఉన్న పెద్ద లోపం ఏ కోచ్ , ట్రైనర్ చెప్పింది వినడు. తనకు తోచినట్లే ఆడతాడు..ఓడతాడు. దాంతో ఎవరూ ఇతన్ని పట్టించుకోరు.
ఇదిలా ఉండగా టెర్రరిస్ట్ లు కొందరు దేశం నలు మూలల్లో మేజర్ సిటీల్లో బాంబ్ బ్లాస్ట్ లు ప్లాన్ చేస్తారు. మనోజ్ (ప్రకాష్ రాజ్) ఆధ్వర్యంలో ఓ టీమ్ ఈ టెర్రరిస్ట్ లను ట్రేస్ చేయటానికి రంగంలోకి దిగుతాడు. అదే సమయంలో “రా” ఎగ్జామ్స్ రాసి, ఇంటర్వ్యూ అయిన తర్వాత సెలెక్ట్ అయ్యేవరకు దేశానికి సేవ చేసేందుకు ఎందుకు ఆగాలి అనే ఉద్దేశంతో, ఆ టెర్రరిస్ట్ ను పట్టుకునేందుకు అనఫీషియల్ గా సీన్ లోకి వస్తాడు జాక్. అప్పుడు ఏమైంది. ఏ సమస్యలు జాక్ కు వచ్చాయి. చివరకు టెర్రరిస్ట్ లను పట్టుకున్నాడా, రా లో ఉద్యోగం సంపాదించాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
నిజానికి ఇదో యాక్షన్ ఎంటర్టైనర్. కానీ ఆ ఎంటర్టన్మెంట్ ని ఎక్కడ దాచిపెట్టారో సినిమా పూర్తైనా మనకు అర్దం కాదు. జాక్ …ప్రతీ దాన్ని ఓ జోక్ లా మార్చేస్తూంటాడు. సీరియస్ గా ఉండే విషయాలు కూడా తెరపై సిల్లీగా మారిపోయి…రా ఏజెన్సీ అంటే ఏంరా అనాలనిపించే సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. నిజానికి బొమ్మరిల్లు భాస్కర్ కు బాగా గ్యాప్ వచ్చి ప్రేక్షుకల పల్స్ పై పట్టుకోల్పోయాడనిపిస్తోంది. మొన్నా మధ్య సల్మాన్ తో మురగదాస్ ఓ డిజాస్టర్ ఇస్తే ఇక్కడ బొమ్మరిల్లు భాస్కర్ మరొటకి పట్టుకుని ముందుకు వచ్చాడు.
అయినా టెర్రిరిస్ట్ లు అనే కాన్సెప్టు సినిమాల్లోంచి మెల్లిగా పోతోంది. ఆ విషయం మర్చిపోయి వాటిని పట్టుకుని వేళ్లాడితే ఇరవై ఏళ్ల క్రితం సినిమాలా అనిపిస్తుంది. దేశంలో నిజంగా అలాంటి పరిస్దితులు ఉంటే చూసేవాళ్లు నిజమే కదా అనుకుంటారు. ఆ బిలీవ్ బులిటీ మిస్సయ్యారు.
అసలు ఏజెంట్ సినిమా అంటేనే తెలుగు ఇండస్ట్రీకు భయపెట్టాలే అఖిల్ క్లాస్ ఇచ్చాక కూడా ధైర్యం చేసారంటే వీరి సాహసానికి మెచ్చుకోవాలి. ఈ సినిమాలో ఏమి లేదు అని చెప్పలేం కానీ … ఈ జనరేషన్ కు తగ్గ రైటింగ్ లేదు. ప్రెజెంటేషన్ లేదు అని చెప్పాలి. ఈ సినిమా ప్లస్ ఏమిటయ్యా అంటే …ఫలానాది బాగుంది అని గుర్తు పెట్టుకుని చెప్పాల్సిన పనిలేదు. ఫస్టాఫ్, సెకండాఫ్ రెండు ఒకేలాగ ఉన్నాయి. కాబట్టి పెద్ద విశ్లేషణ అవసరం లేదు.
టెక్నికల్ గా..
టెక్నికల్ గా కూడా ఈ సినిమాకు మీడియం సినిమాకు తగ్గ స్టాండర్డ్స్ లో కూడా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసోగా ఉంటుంది. పాటలు అంతే సంగతులు. కెమెరా వర్క్ ఉన్నంతలో బెస్ట్ . ఎడిటర్ నవీన్ నూలి మనకు పెద్ద అన్యాయం చేసాడని వాపోతాం. ఏ మాటికా మాట ..నిర్మాతలు మాత్రం ఎక్కడా తగ్గకుండా బాగానే ఖర్చుపెట్టారు. నటీనటుల్లో …సిద్దు తప్పించి మిగతా వాళ్లు గురించి పెద్దగా చెప్పుకునేలా చెయ్యలేదు దర్శకుడు.
చూడచ్చా
ఓటిటిలో ఓ సారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ చూడదగ్గ సినిమా ఇది. వెండి తెరపై ముచ్చటపడి మరీ సిద్దు కోసమో , మరొకరి కోసమే వెళ్లి చూడలేం. ఆ సినిమా హిట్ అవ్వటం కోసం మనం జాకీలం అవ్వలేం.