2023లో విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించగా, రావణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించారు. విడుదలకు ముందు నుంచి, తర్వాత కూడా… సైఫ్ లుక్స్‌పై, నటనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. సినిమా విడుదలైన తర్వాత సైతం ఈ విమర్శలు తగ్గలేదు.

ఇప్పుడు, చాలా రోజుల తర్వాత… సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

“నా కొడుకుతో కలిసి ఆదిపురుష్‌ను చూశాను. అంతా చూసిన తర్వాత నాకు కాస్త బాధేసింది. అసలు ఇది ఎందుకు చేశానని నా మనసు నన్ను ప్రశ్నించింది. నా కొడుకు ముఖంలో అసహనం స్పష్టంగా కనిపించింది. అతనికి ఇది చూడమని బలవంతం చేసినట్టు అనిపించింది. వెంటనే నేను అతనిని క్షమించమన్నా. ఆ పాత్రకు చేసినందుకు ఒప్పుకొన్నందుకు మన్నించమన్నా.” అన్నారు.

, , , ,
You may also like
Latest Posts from