ప్రముఖ కన్నడ స్టార్ ఉపేంద్ర సోమవారం బెంగళూరు ఆసుపత్రిలో కనిపించిన తర్వాత ఆయన హెల్త్ కండీషన్ పై రూమర్స్ వచ్చాయి. అనారోగ్య కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో, సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అభిమానుల ఆందోళన, మీడియా కథనాల నేపథ్యంలో ఉపేంద్ర స్వయంగా స్పందించారు.
‘‘నేను ఆరోగ్యంగానే ఉన్నా. రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లా. రూమర్స్ నమ్మకండి’’ అని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోస్టు పెట్టారు.
https://twitter.com/nimmaupendra/status/1919382493393817691
‘యూఐ’ సినిమా షూటింగ్ సమయంలోనే ఉపేంద్రకు అనారోగ్య సమస్యలు తలెత్తాయని, ఇప్పుడు ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారంటూ కన్నడ మీడియా పేర్కొంది.
సినిమాల విషయానికొస్తే.. గతేడాది ‘యూఐ’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఉపేంద్ర ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన, శివ రాజ్‌కుమార్ కలిసి నటిస్తున్న ‘45’ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది.
మరోవైపు, ఆయన కీలక పాత్ర పోషించిన ‘కూలీ’ (Coolie) ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో రజనీకాంత్ హీరో.