పవన్ కళ్యాణ్‌ నటించిన హరి హర వీర మల్లు సినిమా రిలీజ్ డేటే ఇదే ఇప్పుడు తెలుగు పరిశ్రమలో చర్చనీయాంశం! వాస్తవానికి ఈ నెల మే 30న థియేటర్లలోకి రావాల్సిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, అదే తేదీన విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ ప్లాన్ చేయడంతో కాస్త గందరగోళంలో పడింది. డేట్ మార్చాలన్న ఆలోచన తలెత్తినప్పటికీ… అసలు డేట్ ఫిక్స్ చేసే అధికారమే నిర్మాత చేతుల్లో లేకుండా, డిజిటల్ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ చేతుల్లోకి వెళ్లిపోయిందని సమాచారం.

ఈ నేపధ్యంలో నిర్మాత ఏఎం రత్నం ఓటీటీ భాగస్వామి అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారులతో ప్రత్యేకంగా చర్చించేందుకు ముంబయికి వెళ్లారు. డిజిటల్ హక్కులు అమెజాన్ చేతిలో ఉన్న నేపథ్యంలో, సినిమా విడుదల తేదీ మార్చాలంటే… అది వారి అనుమతితోనే సాధ్యం.

ఈ చర్చల ఫలితంగా హరి హర వీర మల్లు సినిమాను జూన్ 12న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అధికారిక ప్రకటన ఈ వారాంతంలో వెలువడనుంది.

అసలు చిత్రబృందం మే 30న సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేసినప్పటికీ, అమెజాన్ జూన్ 12వ తేదీకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి కృష్ణ మరియు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. సంగీతాన్ని ఎమ్.ఎమ్.కీరవాణి అందించారు. నిర్మాతగా ఏఎం రత్నం వ్యవహరిస్తున్నారు.

ఎందుకంటే హరి హర వీర మల్లు సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. సినిమా విడుదలపై చాలాకాలంగా ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ ఇటీవలే మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి.

, , , , ,
You may also like
Latest Posts from