బాలయ్యకు, మాన్షన్ హౌస్‌కు ఉన్న రిలేషన్ ఈనాటిదేం కాదు! కానీ ఈసారి బాలకృష్ణ ఎంట్రీ మాత్రం లీగల్‌గా, వెరైటీగా ఉంది! టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా మాన్షన్ హౌస్ యాడ్‌లో నటిస్తూ మరోసారి తన స్టైల్ చూపించాడు.
“ఒక్కసారి నేను అడుగుపెడితే…” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో బాలయ్య యాడ్‌లో ఎంట్రీ ఇవ్వడంతో వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.
ఈ యాడ్ ప్రోమోను తన అధికారిక యూట్యూబ్ చానెల్లో విడుదల చేసిన మాన్షన్ హౌస్ కంపెనీ, భారీగా ఈవెంట్‌ను హైప్ చేసింది.
“ఒక ప్రాచీన తాళం చెవి… ఒక అద్భుతమైన సింహాసనం… అపార శక్తితో కూడిన ఒక లెజెండ్… ఇది బాలకృష్ణ అభిమానుల గృహానికి దారి తీస్తోంది! ఈసారి స్వాగతం మామూలుగా ఉండదు…” అంటూ సినిమాటిక్‌గా క్యాప్షన్ జోడించింది.
బాలయ్య మాస్ అటిట్యూడ్‌తో, మాన్షన్ హౌస్ ప్రెజెంటేషన్ మిళితమవడంతో యాడ్‌కి తాళం వేసేంత హైప్ ఏర్పడింది. యాడ్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఫ్యాన్స్ మదిలో హైలైట్ డైలాగ్ విన్నర్‌గా నిలిచింది – “Once I step in…”
ఇది యాడ్ మాత్రమేనంటూ కొందరంటే, “బాలయ్య ఎంట్రీ అంటే చాలు – హంగామా గ్యారంటీ!” అంటున్నారు నందమూరి అభిమానులు. సినిమాల్లోనే కాదు… యాడ్‌ల్లోనూ బాలయ్య మాస్ రెస్పాన్స్ ఇదే!