2025 లో టాలీవుడ్ హీరోల సినిమాలు ఎక్కువగా విడుదల కావటం లేదని గమనించారా? ఈసారి స్టార్‌లందరూ పాన్-ఇండియన్ పెద్ద సినిమాల పై ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే చాలా మంది స్టార్స్ 2025లో కనీసం ఒక సినిమా కూడా ఇవ్వలేని పరిస్దితి కనపడుతోంది.
ఇవి 2025లో మిస్ అయ్యే టాలీవుడ్ స్టార్‌ల లిస్ట్:
మహేష్ బాబు:
SS రాజమౌళి సినిమాలో బిజీ. 2025, 2026లో కొత్త సినిమా రిలీజ్ లేదు.
ఎన్‌టిఆర్:
2024లో “దేవర” సినిమాతో వచ్చాడు. 2025లో “వార్ 2” డబ్బింగ్ సినిమా మాత్రమే రాబోతుంది. ప్రశాంత్ నీల్ “డ్రాగన్” 2026లోనే వస్తుంది.
ప్రభాస్:
ప్రస్తుతం సమ్మర్ బ్రేక్. “స్పిరిట్”, “రాజా సాబ్”, “ఫౌజీ” సినిమాలు జూన్ 2026 తర్వాత. 2025లో రిలీజ్ ప్లాన్ లేదు.
రామ్ చరణ్:
“గేమ్ చేంజర్” తర్వాత “పెద్ది” షూటింగ్‌లో బిజీ, సినిమా 2026 మార్చ్‌లో రిలీజ్.
అల్లు అర్జున్:
“పుష్ప 2” తర్వాత అట్లీ సినిమా 2027లో. 2025-26లో రిలీజ్ లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో, ఒక్క నేచురల్ స్టార్ నాని మాత్రమే ప్రతి సంవత్సరం కొత్త సినిమాలు ఇస్తున్నాడు. అతను టాలీవుడ్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు.
కాబట్టి 2025 నాని ఫ్యాన్స్‌కి మాత్రం ఫెస్టివ్ సీజన్!