సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం కేసులు అప్పుడప్పుడూ బయిటపడుతూ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. తాజాగా డ్రగ్స్‌ కేసులో సినీ హీరో శ్రీరామ్‌ (Sriram) అలియాస్‌ శ్రీకాంత్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. AIADMK మాజీ నేత నుంచి శ్రీరామ్‌ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారంతో నటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతడిని నుంగంబాక్కం స్టేషన్‌కు తరలించి సుమారు రెండు గంటలుగా విచారిస్తున్నారు. నటుడికి వైద్యపరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలినట్లు తెలుస్తోంది.

చెన్నైలోని ఓ బార్‌లో ఏఐఏడీఎమ్‌కే మాజీ నేత ప్రసాద్‌ తాగి గొడవకు దిగాడు. పోలీసులు అతడిచి అరెస్టు చేసి విచారించగా డ్రగ్స్‌ వ్యవహారం బయటపడింది. హీరో శ్రీరామ్‌ కోసం ప్రదీప్‌ అనే వ్యక్తి తన దగ్గర కొకైన్‌ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. ప్రదీప్‌కు 40 సార్లు డ్రగ్స్‌ అమ్మినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకుని పరీక్షలు చేయగా డ్రగ్స్‌ వాడినట్లు తేలిందని వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై హీరో శ్రీరామ్‌ స్పందించాల్సి ఉంది.

ఇది వ్యక్తిగత పతనమా? లేక వ్యవస్థపై ఆరోపణలా?

ప్రశ్నలు బోలెడన్ని. ఒక నటుడు తప్పుదారి పట్టాడు అంటే, దానికి బాధ్యత ఎవరిది? ఇతనికేనా? లేక అతడిని ముంచిన ఒత్తిడి, వంచనల దారిలో నడిపించే ఫేక్ గ్లామర్ ప్రపంచానిదా?

ఈ వ్యవహారం మరోసారి తెర వెనుక నిశ్శబ్దంగా ఉండే డిప్రెషన్, ఒత్తిడులు, ఒంటరితనాన్ని తెరమీదకు తెచ్చింది. ప్రేక్షకులకు ప్రతి నటుడు కలల రాజకుమారుడే. కానీ ఆయన హృదయంలో ఏ బాధలు కదలుతున్నాయో, ఏనాటికైనా తప్పించుకురాలేకపోతే ఇలానే వార్తల్లో పేరు మారుతుంది.

కెమెరా లైట్లకు వెలుగు ఇవ్వాలంటే ముందుగా మనసులో చీకట్లను ఎదుర్కొనాలి.

You may also like
Latest Posts from