విష్ణు మంచు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. డ్రీమ్ ప్రాజెక్ట్, బిగ్ బడ్జెట్ సినిమా, భారీ తారాగణం – అన్నీ కలిసొచ్చిన ఈ సినిమాకు ఎలాంటి ఓపెనింగ్ రాబడుతుంది అన్న దానిపై ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, మొదటి రోజే ₹100 కోట్ల గ్రాస్ టార్గెట్ పెట్టుకున్నారన్న వార్తలతో హైప్ మరింత పెరిగింది.

అసలు 100 కోట్లు మొదటి రోజే సాధ్యమా?

ఒక్కసారి లెక్కలు వేసుకుంటే…

స్క్రీన్ కౌంట్ : ప్రపంచవ్యాప్తంగా సుమారు 5400 స్క్రీన్లు , ఇండియాలోనే 4300+
ప్రీమియర్ షోలు : అమెరికాలో భారీగా ప్లాన్

మంచు విష్ణుకు భాక్సాఫీస్ వద్ద క్రేజ్ లేకపోయినా ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హంగామాతో కూడిన కాన్వాస్ చూస్తే, ఓపెనింగ్ డే ₹100 కోట్లు సాధ్యమే అని లెక్కలు వేస్తున్నారని తెలుస్తోంది. కానీ అది జరిగే పని కాదని ఓ వర్గం అంటోంది. ఎందుకంటే…


సమస్యలు ఎక్కడున్నాయి?

విశేషంగా ప్రమోషన్స్ జరగలేదన్న విమర్శలు. నార్త్ మార్కెట్‌లో బాలీవుడ్ ప్రమోషన్ రేంజ్ అంతగా కనిపించలేదు. ముఖ్యంగా అక్షయ్ – ప్రభాస్ లాంటి స్టార్ పుల్స్‌ను కరెక్ట్‌గా ఉపయోగించలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

డిజిటల్ & శాటిలైట్ డీల్ ఇంకా ఫిక్స్ కాదు

సినిమా బడ్జెట్ సుమారు ₹200 కోట్లు అని టాక్ ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఓటీటీ డీల్ ఫైనలైజ్ కాలేదు. విష్ణు మంచుకు వచ్చిన ఆఫర్లు నచ్చకపోవటంతో రిలీజ్ తర్వాతే డీల్ చేద్దామని ప్లాన్ చేశారని చెప్తున్నారు.

డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ విభిన్నంగా

కమర్షియల్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా, కమిషన్ బేస్ మీదే చాలా ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. దీని వల్ల ఓవర్సీస్, ఆంధ్రా-Telangana, తమిళనాడు, కర్నాటక మార్కెట్లలో ప్రొఫెషనల్ వాల్యూయేషన్ కాస్త తక్కువగా ఉండొచ్చు.


ఒకవేళ హిట్ టాక్ వస్తే…

కంటెంట్ పరంగా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, మొదటి రోజు కలెక్షన్స్ వాస్తవానికి మించి ఉండొచ్చు. ప్రభాస్, అక్షయ్, మోహన్ లాల్ వంటి స్టార్‌ పవర్ కిక్ ఇస్తే, మల్టిపుల్ లాంగ్వేజ్ మార్కెట్లలో పెద్ద ఎత్తున కలెక్షన్లు రావచ్చు.


ఫైనల్ గా

100 కోట్లు మొదటి రోజే? – టార్గెట్ భారీగా ఉన్నా, మిషన్ కష్టమే!

విశేష హైప్ ఉన్నప్పటికీ, 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించడం కోసం టాక్, టైమింగ్, టాలెంట్ అన్నీ కలిసి రావాలి. సినిమా కంటెంట్ బలంగా ఉంటే, మొదటి రోజు ఆశించినంత కాకపోయినా, వసూళ్లు వారం దాటే సరికి మైలురాళ్లను చేరుకోవచ్చు.

విష్ణు మంచు ‘కన్నప్ప’ డ్రీమ్ … ఇప్పుడు పాన్ ఇండియా రియాలిటీ అవుతుందా? జూన్ 27 రిజల్ట్ చెబుతుంది!

, , , ,
You may also like
Latest Posts from