బాలీవుడ్, హాలీవుడ్ రెండింటినీ దున్నేస్తున్న స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా… ఇప్పుడు మన దేశం వైపు మరోసారి అడుగులేస్తోంది. గ్లోబల్‌ ఐకాన్‌గా వెలుగొందుతున్న ఆమె, ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ SSMB29 కోసం రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

“ఇది కేవలం సినిమా కాదు… నాకొక హోంకమింగ్!” అని భావోద్వేగంతో చెప్పిన ప్రియాంకా… చాలా కాలంగా ఇండియన్ సినిమాల్ని, భారత్‌నే మిస్సవుతున్నానని చెప్పింది. రాజమౌళి వంటి డైరెక్టర్‌తో, మహేష్‌బాబు వంటి స్టార్‌తో కలిసి పనిచేయడం తనకో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తోంది.

ఈ మేగ్నమ్ ఓపస్ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సంగీతం ఎం.ఎం. కీరవాణి అందిస్తుండటం… ప్రాజెక్ట్‌కి మరో లెవెల్ హైప్ తెచ్చింది.

ప్రియాంక హాలీవుడ్ స్టార్‌గా ఎదిగాక, భారత సినిమాలకు చాలా దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు ఈ మూవీతో ఆమె తిరిగొస్తుండటంతో… ప్రేక్షకులు, ఫ్యాన్స్… “ఇది నిజంగా గ్రాండ్ రీ ఎంట్రీ అవుతుందా?” అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

SSMB29 కేవలం ఓ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మే కాదు… ఇండియన్ సినిమా అంతర్జాతీయ దశను తాకే మైలురాయిగా నిలవబోతోందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి!

, , ,
You may also like
Latest Posts from