సినిమా థియేటర్లలో విజయవంతంగా దూసుకెళ్తోంది… ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందుతోంది… కానీ అదే సమయంలో ఓ శత్రువు వెనక నుంచి వెంటాడుతోంది. అదే పైరసీ! సినిమాను పక్కా క్వాలిటీతో థియేటర్లో చూడాలనుకునే వారికి ఇది పెద్ద నష్టం. సినిమా యూనిట్‌కి అయితే కోట్లు కోట్లు నష్టమవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ దీనికి బలయ్యారు.

తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సితారే జమీన్ పర్’ కోసం అమీర్ ఖాన్ గట్టిగానే ప్లాన్ చేశాడు. ప్రజలు థియేటర్‌కు వచ్చి సినిమా చూడాలన్నదే అతని లక్ష్యం. అందుకే ఓటీటీ డీల్స్‌ను రిజెక్ట్ చేశాడు. సినిమా విడుదలయ్యాక ఎనిమిది వారాలపాటు డిజిటల్‌లో పెట్టబోమని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. నిజానికి ఆ ప్లాన్ వర్క్ అయ్యింది కూడా. ‘సితారే జమీన్ పర్’ థియేటర్లలో హిట్ అయ్యింది. వీకెండ్లలో మంచి కలెక్షన్లు రాబడుతోంది.

అయితే ఇప్పుడు ఆ విజయానికి పెద్ద అడ్డంకి వచ్చేసింది. ఫుల్ HD కాపీ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. పలు పిరేటెడ్ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ ఛానెల్స్ మీద ఇప్పుడు ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇది కేవలం థియేటర్ కలెక్షన్స్‌కే కాదు, భవిష్యత్తులో వచ్చే ఓటీటీ రివెన్యూకీ పెద్ద దెబ్బ.

ఈ పరిస్థితుల్లో అమీర్ ఖాన్ దూకుడు పెంచాడు. యూట్యూబ్‌పై Pay-Per-View మోడల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కానీ ఇప్పటివరకు డిజిటల్ రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. పైరసీని ఆపడానికి, ఇప్పటికే ఉన్న లింకులను డిలీట్ చేయించేందుకు అతని టీం యాక్టివ్‌గా పనిచేస్తోంది.

ఈ సంఘటన ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది — పైరసీని అరికట్టే వరకు సినిమాల భద్రతే ప్రశ్నార్థకం! అమీర్ లాంటి స్టార్‌కి కూడా ఇది ఎదురైతే, ఇతర దర్శక, నిర్మాతల పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు.

సినిమా ప్రేమికులుగా మన బాధ్యత ఏమిటంటే — క్వాలిటీ కంటెంట్‌ను కాపాడాలని, థియేటర్‌లోనే చూసి, సృష్టికర్తల కష్టానికి గౌరవం ఇవ్వడం. పైరసీకి గుడ్‌బై చెప్పేదీ మన చేతులే!

, , ,
You may also like
Latest Posts from