విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం కింగ్‌డమ్ నేటి అర్ధరాత్రి థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తోంది. గత కొంతకాలంగా విజయ్‌కు సరైన హిట్ దక్కలేదు. ఈ సినిమాలో ఆయనకి సెకండ్ ఛాన్స్ లాంటి మళ్లీ ఒకసారి స్టార్‌గా నిలబడే అవకాశమంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ.
ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా భారీ ఖర్చులు చేశారు. షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని పార్ట్స్ రీషూట్ చేసి, మరిన్ని విజువల్ టచ్‌లు జోడించడంతో కింగ్‌డమ్ రిలీజ్ కొంత ఆలస్యమైంది. జెర్సీ సినిమాతో క్లాస్ మరియు ఎమోషన్ టచ్‌తో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి, ఈసారి పూర్తిగా యాక్షన్ రూట్ తీసుకున్నారు. ట్రైలర్ చూస్తే గౌతమ్ టోటల్ మేకోవర్‌పై స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ సినిమా పట్ల ‘నేచురల్ స్టార్’ నానికీ ప్రత్యేకంగా ఆసక్తి ఉంది. ఎందుకంటే… గౌతమ్ తిన్ననూరి-నాని కాంబినేషన్‌లో మళ్లీ ఒక భారీ యాక్షన్ డ్రామా ఉండబోతోంది. స్క్రిప్ట్ రెడీగా ఉంది, నాని ఓకే కూడా చెప్పేశాడు. కానీ ఫైనల్ గ్రీన్ సిగ్నల్ మాత్రం కింగ్‌డమ్ ఫలితంపై ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే, గౌతమ్-నాని కాంబో ప్రాజెక్ట్ 2027లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.
ఇక కింగ్‌డమ్ హిట్ అయితే, దానికి సీక్వెల్ కింగ్‌డమ్ 2 కూడా వెంటనే స్టార్ట్ అవుతుంది. మొత్తానికి, విజయ్ దేవరకొండ కెరీర్ రీబిల్డ్ కావాలంటే, గౌతమ్ తిన్ననూరికి మాస్ యాక్షన్ డైరెక్టర్‌గా మరో లేబుల్ రావాలంటే… ఈ సినిమానే కీలకం.
ఇదిప్పుడు కేవలం సినిమా కాదు… ఒకరు స్టార్‌గా తిరిగి రావాలనే ఆశ, మరొకరు కొత్త లెవల్‌కు వెళ్లాలనే లక్ష్యం మధ్య జరుగుతున్న గేమ్!