మెగా ఫ్యాన్స్‌కి సంతోషకరమైన వార్త! బ్లాక్‌బస్టర్ అయిన “వాల్తేరు వీరయ్య” కాంబో మళ్లీ కలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర)తో కలిసి పని చేయబోతున్నారు. ఈ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందనుంది.

ప్రస్తుతం యష్‌తో “టాక్సిక్” అనే భారీ ప్రాజెక్ట్‌ రూపొందిస్తున్న KVN ప్రొడక్షన్స్‌… త్వరలో చిరు – బాబీ కాంబినేషన్‌లో మాస్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనను బాబీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడం విశేషం.

చిరంజీవి – బాబీ కాంబోకి మరోసారి శ్రీకారం

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా అధికారిక ప్రకటన ఈ నెలలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యే అవకాశముంది. షూటింగ్ ఈ ఏడాది చివరలో లేదా 2026 ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం తర్వాత చిరు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేస్తారు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన “వాల్తేరు వీరయ్య” బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అందువల్ల ఈసారి కూడా అదే స్థాయి విజయం ఆశిస్తున్నట్టు అభిమానుల అంచనాలు.

, , ,
You may also like
Latest Posts from