ఈ పంద్రాగస్టుకు తెలుగు ప్రేక్షకుల ముందు సిల్వర్ స్క్రీన్‌పై ‘మాస్ వర్సెస్ మాస్’ పోటీ రాబోతోంది. లైట్స్ ఆఫ్ కాగానే, ఒకవైపు రజినీ–లోకేష్ బ్లాక్‌బస్టర్ కాంబోలో వస్తున్న ‘కూలీ’, మరోవైపు హృతిక్–ఎన్టీఆర్ కాంబినేషన్‌లో యాక్షన్ ఫెస్ట్‌గా సిద్ధమైన ‘వార్ 2’…! రెండు సినిమాలకీ దేశవ్యాప్తంగా క్రేజ్ పీక్‌లో ఉంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్, బుకింగ్స్ రికార్డులు, ఫ్యాన్స్ మూడ్ – అన్నీ కలిపి మార్కెట్‌లో వాతావరణం హీట్‌గా ఉంది.
తెలంగాణలో బుకింగ్స్ ఓపెన్!
ఇతర రాష్ట్రాల్లో ముందుగానే బుకింగ్స్ ప్రారంభమై టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడైపోతుండగా, తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎదురుచూసిన సమయం వచ్చింది. మంగళవారం సాయంత్రం నుంచి బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
తెలంగాణలో టికెట్ ధరల్లో ఎలాంటి పెంపు లేదు – సింగిల్ స్క్రీన్‌లలో ₹175, మల్టీప్లెక్స్‌లలో ₹295కే అందుబాటులో ఉన్నాయి. మార్నింగ్ షోకు ముందుగా ఒక్క స్పెషల్ షోకు మాత్రమే అనుమతి, అది ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రదర్శించనున్నారు. రెండు సినిమాలకూ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో థియేటర్లు షెడ్యూల్ సెటప్ చేయడంలో బాగా కసరత్తు చేశాయి.
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కొంత సడలింపు ఇచ్చారు. సింగిల్ స్క్రీన్‌లలో ₹50, మల్టీప్లెక్స్‌లలో ₹75 వరకూ టికెట్ ధరలు పెంచుకునే అనుమతి లభించిందని టాక్. అయితే, దీని మీద అధికారిక ప్రకటన కోసం ఇంకా వేచి చూడాలి.