రెజినా క్యాసాండ్రా (Regena Cassandra) గ్లామర్ ప్రపంచంలో ఒక ప్రత్యేక పేరు. 2012 నుంచి తెలుగు సినిమాల్లో హీరోయిన్లుగా స్ఫూర్తిదాయక పాత్రలు చేయడంలో రెజినా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే, కొంత కాలం కెరీర్ కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఇప్పుడు ఆమె బాలీవుడ్, కొలీవుడ్‌లో కూడా తన ప్రతిభను ప్రదర్శిస్తూ తనకంటూ సొంత గుర్తింపును సాధిస్తోంది.

సుందర్ సి దర్శకత్వంలో నయనతారతో కలిసి నటించనున్న ‘మూకుతి అమ్మన్ 2’లో రెజినా కనిపించబోతుంది. అలాగే, మధుర భండార్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది వైవ్స్’ సినిమాలో భాగస్వామ్యంగా ఉంది. తెలుగు చిత్రాలలో మూడు ప్రధాన పాత్రలపై చర్చలు జరగుతున్నాయి. పైగా, ఒక పెద్ద తమిళ ప్రాజెక్ట్ కూడా ఆమెను ఎదురు చూస్తోంది. అంటే రాబోయే రోజుల్లో రెజినాకు బిజీ షెడ్యూల్ ఖాయం.

టీవీ రంగంలో కూడా ఆమె పేరు చర్చనీయాంశం అయింది. టాప్ రేటెడ్ తెలుగు డాన్స్ షో ‘ఢీ’లో జడ్జి గా కనిపించి, మంచి ప్రాచుర్యం పొందింది. సినిమా, టీవీ, పెద్ద ప్రాజెక్టుల కలయికతో రెజినా క్యాసాండ్రా ఈ ఏడాది నెక్ట్స్ లెవిల్ కు వెళ్లే అవకాసం ఉంది.

You may also like
Latest Posts from