పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కంబ్యాక్ ఎపిక్ “హరి హర వీర మల్లు: పార్ట్ 1 – Sword vs Spirit” థియేటర్స్‌లో జూలై 24న రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు, ఒక నెల కూడా గడవకముందే, ఓటిటి ఎంట్రీకి రెడీ అవుతోంది!

ఇండస్ట్రీ టాక్ ఏంటంటే – ప్రైమ్ వీడియో రైట్స్ డీల్‌లో భాగంగా, “జూలైలో థియేటర్ రిలీజ్ జరగాలి, అప్పుడే ఆగస్టులో స్ట్రీమింగ్ కి వస్తాం” అని క్లియర్‌గా చెప్పారట. అదే కారణం వల్ల, ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ డిలేస్, ఫైనాన్షియల్ ఇష్యూలతో స్ట్రగుల్ అవుతున్నప్పటికీ, జూలై ఎండ్‌కల్లా సినిమాను స్క్రీన్స్‌కి పంపాల్సి వచ్చింది.

ప్రైమ్ వీడియో ఇప్పుడే కొత్త పోస్టర్ డ్రాప్ చేసి, ఆగస్టు 20 నుంచి స్ట్రీమింగ్ ఖాయం చేసింది.

జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో, క్రిష్ స్టోరీ ఆధారంగా తీసిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో, పవన్‌కల్యాణ్ వీర మల్లుగా, నిధి అగర్వాల్ పంచమిగా, బాబీ డియోల్ ఔరంగజేబ్‌గా కనిపించారు. పార్ట్ 1 క్లోజింగ్‌లోనే పవన్ vs బాబీ డియోల్ షోడౌన్ సెట్ చేయడంతో, అసలు ఫుల్-ఫైర్ ఫైట్ పార్ట్ 2లోనే అన్న క్లారిటీ ఇచ్చేశారు.

అయితే, సినిమాపై కాంట్రవర్సీ కూడా తగ్గట్లేదు. ఒక మాజీ IAS ఆఫీసర్ కోర్టుకి వెళ్లి, పవన్ తన పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ వాడుకుని ప్రమోషన్స్ చేసుకున్నాడని ఆరోపించాడు. కానీ వీటన్నింటినీ పక్కన పెట్టి, ఇప్పుడు సినిమా ఓటీటీలో మాస్ ఆడియన్స్‌ని చేరుకోబోతుంది.

హరి హర వీర మల్లు: పార్ట్ 1 – Sword vs Spirit ఆగస్టు 20 నుంచి ప్రైమ్ వీడియోలో!

, , , , , , ,
You may also like
Latest Posts from