చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న “మన శంకర ప్రసాద్ గారు” టీజర్ ఒక్కటే టాలీవుడ్‌లో హంగామా చేస్తోంది. మెగాస్టార్ స్టైలిష్ లుక్, సిగ్నేచర్ స్వాగ్ చూసి ఫ్యాన్స్ జోష్ మిగలడం లేదు. ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్‌కి సునామీ తప్పదనిపిస్తోంది.

“చిరు లుక్స్‌లో VFX ఒక్కటీ లేదు!” – రావిపూడి క్లారిటీ

ఇప్పుడు హీరోల లుక్స్‌కి ఎఫెక్ట్స్ వేసి మెరుగు పరచడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు –
“చిరంజీవి గారి లుక్ అంతా ఒరిజినల్. మన శంకర ప్రసాద్ గారు లో VFX 5% కూడా వాడలేదు. ఆయన లుక్ మొత్తం ఆర్గానిక్” అని క్లారిటీ ఇచ్చాడు.

వింటేజ్ చిరు – పక్కా ఎంటర్టైనర్

టీజర్‌కి వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, మెగాస్టార్ లేటెస్ట్ లుక్ చూస్తే పాత జ్ఞాపకాలు రిపీట్ అయినట్టే. డైరెక్టర్ మాటల్లో –

“సాంగ్స్, కామెడీ అవుట్‌స్టాండింగ్‌గా వచ్చాయి”
“ఇంకా ఎన్నో సర్ప్రైజ్‌లు దాచిపెట్టాం”
“ఇది ఒక చిన్న గ్లింప్స్ మాత్రమే, అసలు రచ్చ ఇంకా మిగిలే ఉంది”

ఫ్యాన్స్ అంచనాలు పీక్స్‌లోకి వెళ్ళిపోయాయి. మనా శంకర ప్రసాద్ గారు విడుదలయ్యే సరికి సంక్రాంతి బాక్సాఫీస్ రికార్డులు ఊడగొట్టడం ఖాయం అనిపిస్తోంది.

, , ,
You may also like
Latest Posts from