సినిమా ఇండస్ట్రీలో టెక్నాలజీ టేకోవర్ జోరందుకుంది. గ్రాఫిక్స్, VFX, డీప్ ఫేక్‌లతో ఆగిపోయిందనుకుంటే పొరపాటు..! ఇప్పుడు హీరోల గొంతు కూడా AI మాయాజాలంలోకి వెళ్లిపోయింది. దానికి తాజా ఉదాహరణ తేజ సజ్జా హీరోగా వచ్చిన ‘మిరాయ్’ .

ఈ సినిమాలో ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడని అనుకున్నారంతా, సినిమా ప్రారంభం ప్రభాస్ వాయిస్ తో మొదలవుతుంది. ఈ నేఫధ్యంలో మేకర్స్ బాంబ్ పేల్చేశారు. అసలు ప్రభాస్ స్టూడియోలో లేరు..! ఆయన అనుమతితోనే AI టెక్నాలజీతో ప్రభాస్ వాయిస్‌ని క్రియేట్ చేసి సినిమా స్టార్ట్‌లో వచ్చే కీలక ఎపిసోడ్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చారట.

అంటే థియేటర్లలో వినిపిస్తున్నది ప్రభాస్ అసలైన గొంతు కాదు, కానీ AI సృష్టించిన ప్రభాస్ గొంతే..!
ఇదే విషయాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్‌తో పాటు థ్రిల్‌ అవుతున్నారు.

ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నట్టుగా.. ప్రభాస్ వాయిస్ ఓవర్ ‘మిరాయ్’ కి ఒక కొత్త రేంజ్ వైబ్ ఇచ్చిందట. తేజ సజ్జా పెర్ఫార్మెన్స్, మంచు మనోజ్ విలన్ యాక్ట్‌కి తోడు, ఈ AI వాయిస్ ఓవర్‌నే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇక మిలియన్ డాలర్ ప్రశ్న ఏమిటంటే:
రేపటినుంచి హీరోలు డబ్బింగ్ చెప్పకుండానే AI వాయిస్‌తో సినిమాలు రావచ్చా..?
అంటే, సినిమా భవిష్యత్తు ఎక్కడికి దూసుకెళ్తుందో ఊహించండి..!

, , , , ,
You may also like
Latest Posts from