‘కిష్కింధపురి’..సినిమా మిరాయ్ మ్యాజిక్ లో తేలిపోయినా, పెద్దగా టాక్ లేకపోయినా కలెక్షన్స్ మాత్రం స్టడీగా ఉండటం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ హారర్ థ్రిల్లర్ తో బాక్సాఫీస్ వద్ద గట్టి కంబ్యాక్ ఇచ్చాడు.

రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్స్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ హర్రర్-సస్పెన్స్ థ్రిల్లర్, థియేటర్లలోకి వచ్చిన దగ్గర నుంచి బాక్సాఫీస్ వద్ద తనదైన రీతిలో దూసుకుపోతోంది.

బెల్లంకొండ – అనుపమ జోడీ మళ్లీ స్క్రీన్‌పై

‘రాక్షసుడు’ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా, ఆడియన్స్ లో కాస్త ఎక్సైట్‌మెంట్ రేపింది. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి ఈ సినిమాను డైరెక్ట్ చేయగా, సాహు గారపాటి ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై నిర్మించారు.

ప్రిమియర్స్ నుంచే పాజిటివ్ వైబ్స్

సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ సినిమాకి, రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. వాటికే అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో, ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా – Day 1 కంటే Day 2, Day 2 కంటే Day 3 కలెక్షన్స్ ఎక్కువ రావడం ట్రేడ్ కి సర్ప్రైజ్ అయ్యింది.

వీక్ డేస్‌లో కూడా కలెక్షన్స్ హోల్డ్

కేవలం వీకెండ్స్ లోనే కాదు, వీక్ డేస్‌లో కూడా ‘కిష్కింధపురి’ మంచి కలెక్షన్స్ రాబడుతూ, హర్రర్ థ్రిల్లర్ జానర్ కి మళ్లీ క్రేజ్ తెచ్చింది. రివ్యూలు యావరేజ్ అన్నా , కలెక్షన్స్ మాత్రం స్టడీగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

నైజాం లో డబుల్ ప్రాఫిట్స్

నైజాం రైట్స్ ను కేవలం 1.5 కోట్లకే ఇచ్చేసారు. అయితే 9 రోజుల్లోనే 3.2 కోట్ల షేర్ (జీఎస్టీ కలిపితే 3.75 కోట్ల షేర్) రాబట్టి, డిస్ట్రిబ్యూటర్లకు డబుల్ లాభాలు తెచ్చిపెట్టింది. ఇంకా ఈరోజుకూడా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రికార్డ్ అవుతున్నాయి.

బెల్లంకొండకు కంబ్యాక్ హిట్

మొత్తం గా ఇప్పటివరకు సినిమా దాదాపు 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బ్రేక్‌ఈవెన్ 15 కోట్ల గ్రాస్ దగ్గరే కావడంతో ‘కిష్కింధపురి’ క్లిన్ హిట్ గా నిలిచింది. గతంలో బెల్లంకొండ చేసిన ‘భైరవం’ డబుల్ డిజిట్ గ్రాస్ కూడా రాబట్టలేకపోయినా, ఈసారి మాత్రం హారర్ థ్రిల్లర్ జానర్ లో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

, , , ,
You may also like
Latest Posts from