
‘దేవర పార్ట్ 1’తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాప్ రైటర్-డైరెక్టర్ కొరటాల శివ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ తో ‘దేవర 2’పై క్లారిటీ రాకపోయినా, నాగచైతన్యతో ఒక సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఇక తాజాగా… సినీ వర్గాల్లో హాట్ టాపిక్ ఏంటంటే – కొరటాల శివ, నందమూరి బాలకృష్ణను కలవబోతున్నాడట!. బాలయ్య కోసం ప్రత్యేకంగా ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ మీటింగ్ జరిగిందని, అయితే దాన్ని పూర్తిగా ఓకే అయ్యేదాకా రహస్యంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, బాలయ్యతో సినిమా చెయ్యటానికి కొరటాల శివ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడట. త్వరలోనే మరో మీటింగ్ జరుగనుంది.
ప్రస్తుతం బాలయ్య ‘అఖండ 2’ తో బిజీగా ఉండగా, గోపీచంద్ మలినేని, క్రిష్ సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి. అంటే మరో ఏడాది పాటు బాలయ్య షెడ్యూల్ ఫుల్. కాబట్టి కొరటాల శివ బాలయ్యకో, లేక ఆయన కుమారుడు మోక్షజ్ఞకో కథ చెప్పబోతున్నాడా అన్నది సస్పెన్స్‌గానే ఉంది.
బాలయ్య-కొరటాల శివ కాంబినేషన్ సెట్టైతే ఇండస్ట్రీలో ఏ రేంజ్ హంగామా జరుగుతుందో ఊహించండి!
