సినిమా వార్తలుసోషల్ మీడియా

“అబద్ధం చెప్పిన వారిని అస్సలు వదిలిపెట్టను!” – తమన్నా

స్టార‍్ హీరోయిన్ తమన్నా భాటియా ఇటీవల రిలేషన్‌షిప్‌లపై ఓపెన్‌గా మాట్లాడింది. తప్పులు చేస్తే క్షమించగలను కానీ మొఖం మీద అబద్ధం చెబితే మాత్రం సహించలేను అని స్పష్టంగా చెప్పింది.

“అబద్ధం చెప్పే వారితో నేను డీల్‌ చేసుకోలేను. నా ముందే అబద్ధం చెప్పి, నేను నమ్మేస్తాను అనుకుంటే… అది నన్ను రెచ్చగొడుతుంది,” అంటూ తమన్నా హాట్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

ఈ కామెంట్స్‌తో వెంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. గత రెండేళ్లుగా డేటింగ్ చేసిన విజ‌య్‌ వర్మతో బ్రేకప్ కూడా ఇదే నమ్మకం సమస్య వల్లేనేమో అనే గుసగుసలు మళ్లీ వేడెక్కుతున్నాయి.

ఇక మరోవైపు తమన్నా ప్రస్తుతం సినిమాలతో, ప్రత్యేక గీతాల‌తో బిజీగా ఉంటుంది.

నిజం చెప్పినా నిప్పులు చెరుగుతుంది… అబద్ధం చెప్పినా పర్లేదా? తమన్నా సీరియస్ వార్నింగ్‌తో సోషల్ మీడియాలో హీట్ పెరిగింది!

Similar Posts