సినిమా వార్తలుసోషల్ మీడియా

“దావూద్‌ ఉగ్రవాది కాదు” అనేసి… క్షణాల్లో యూ-టర్న్!

బాలీవుడ్‌ మాజీ స్టార్ హీరోయిన్, ఇప్పుడు సన్యాసినిగా మారిన మమతా కులకర్ణి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు తెరతీరాయి. “దావూద్‌ ఇబ్రహీం ఉగ్రవాది కాదు!” అంటూ చెప్పిన ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. వెంటనే విమర్శలు ముంచెత్తడంతో… మమతా షాకింగ్‌గా వెనక్కి తీసుకున్నారు!

ఒకప్పుడు కరణ్ అర్జున్, క్రాంతివీర్, సబ్‌సే బడా ఖిలాడీ వంటి పెద్ద సినిమాల్లో నటించి స్టార్‌గా వెలుగొందిన మమతా, తెలుగు సినిమాల్లో కూడా మెప్పించారు. కానీ సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పి సన్యాసం తీసుకొని… యామై మమత నందగిరిగా పరిచయం అయ్యారు.

ఈ సంవత్సరం మహాకుంభమేళాలో మహామండలేశ్వర్‌గా కూడా ప్రకటించుకున్నారు. కాషాయ దుస్తులతో, ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించిన మమతా… 25 ఏళ్ల తర్వాత ఇండియా రీ-ఎంట్రీలో అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇటీవల గోరఖ్‌పూర్‌ పర్యటనలో మీడియాతో మాట్లాడిన సమయంలోనే వివాదం గుదిగుచ్చింది. “దావూద్‌ ముంబై బాంబ్‌బ్లాస్ట్‌లకు కారణం కాదు.. ఆయన పక్కా మాస్‌, మంచి మనిషి” అని అన్నారు. ఆ మాటలు విని షాక్‌ అయ్యిన నెటిజన్లు ఆగ్రహంతో మండిపడ్డారు. విమర్శలు వెల్లువెత్తాయి.

అప్పుడు మమతా వెంటనే యూటర్న్‌ తీసుకుని,

“నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. దావూద్‌ ఉగ్రవాదే. నేను విక్కీ గోస్వామి గురించి అన్నాను” అంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ అప్పటికే వీడియో వైరల్‌ అయిపోయి… ఆమె కామెంట్స్ మళ్లీ రెచ్చగొడుతున్నాయి.

బాలీవుడ్‌ మాజీ స్టార్ దావూద్ పేరు చెప్పి ఇలా ఎందుకు మాట్లాడింది? నిజంగా పొరపాటా… లేదా వేరే కథ దాగుందా? సోషల్ మీడియా మళ్లీ డిబేట్ లో పడింది!

ఇక ఇప్పుడు నెటిజన్స్ రియాక్షన్స్‌తో మమతా క్లిప్ మరోసారి వైరల్ అవుతోంది.

Similar Posts