సినిమా గాసిప్స్సినిమా వార్తలు

‘జటాధర’ ఫలితం ముందే ఊహించిన సోనాక్షి – తెలివిగా తప్పించుకుందా?

కొన్ని సినిమాలు చేస్తూండగానే “ఇది ఎక్కడికి వెళ్తుందో” హీరో, హీరోయిన్లకు క్లియర్‌గా అర్థమైపోతుంది. మరికొన్ని సినిమాలు టీజర్, ట్రైలర్ చూసిన క్షణంలోనే ఫలితం తెలుస్తుంది. అచ్చం అటువంటి కేటగిరీలో పడింది సుధీర్ బాబు–సోనాక్షి సిన్హా కలయికలో వచ్చిన ‘జటాధర’.

ఈ సినిమా స్థాయి ఎలా ఉందంటే…ప్రేక్షకులు సీట్లో కూర్చుని ఉన్నప్పుడు “ఇది సినిమా లేదా ట్రయల్స్ ఫుటేజ్?” అనిపించేంత లెవెల్. మేకింగ్, స్క్రీన్‌ప్లే, టెక్నికల్ వాల్యూస్ అన్నీ డిజాస్టర్ క్లాస్.

ఇంత హై బడ్జెట్‌లో, ఇంత దారుణమైన ఎగ్జిక్యూషన్‌ – ‘జటాధర’ అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ‘జటాపతనం’గా మారిపోయింది.

సోనాక్షి తెలివితేటలు వర్కౌట్ అయ్యాయా?

బాలీవుడ్ స్టార్‌గా ఉన్న సోనాక్షి సిన్హా, ఈ సినిమా ద్వారా తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సాధారణంగా అలాంటి సందర్భాల్లో స్టార్ హీరోయిన్లు ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, ప్రమోషన్లు అన్నీ ఫుల్‌గా చేస్తారు. కానీ ‘జటాధర’ విషయంలో మాత్రం సోనాక్షి అటువంటి ప్రయత్నమే చేయలేదు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి వచ్చింది, రెండు మాటలు మాట్లాడి “బెస్ట్ విషెస్” చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత? సైలెన్స్. ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలు, ప్రీ–రిలీజ్ ఈవెంట్ — అన్నింటినీ స్కిప్ చేసింది.

నిర్మాతలు అనేకసార్లు రిక్వెస్ట్ చేసినా — “నేను బిజీగా ఉన్నాను” అంటూ పక్కన పెట్టేసిందట. ఆ సమయంలో అందరూ “సోనాక్షి ఎందుకలా?” అనుకున్నారు.

ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక అందరూ అంటున్నారు —“ఇంత తెలివిగా ముందే రిజల్ట్ అంచనా వేసిందా సోనాక్షి?”.

జటాధర – ఎక్కడి నుంచి మొదలై, ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియదు!

సుధీర్ బాబు ఈ సినిమాకి రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు. జీ స్టూడియోస్ backing తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. కానీ స్క్రీన్‌పై వచ్చిన ఫలితం మాత్రం — సంపూర్ణ విఫలం. కథ కూడా పాత బాటలో, టెక్నికల్ వాల్యూస్ కూడా అవుట్‌డేటెడ్ లెవెల్‌లో ఉన్నాయి. ప్రేక్షకులు సీరియస్‌గా అడుగుతున్నారు — “జీ స్టూడియోస్ లో ఈ స్క్రిప్ట్ ఎప్రూవ్ చేసినవాళ్లు ఎక్కడ?”

సోనాక్షి కెరీర్‌పై ఇంపాక్ట్?

“ఇది నా సినిమా కాదు” అన్నట్టుగా సోనాక్షి దూరంగా ఉన్నా — పోస్టర్‌లో ఆమె ముఖం ఉన్నంత వరకూ ఈ ఫ్లాప్ కూడా ఆమె ఖాతాలో పడిందే. ఇప్పటికే బాలీవుడ్‌లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న ఆమెకి, ఇలాంటి ప్రాజెక్టులు ఇంకోసారి కెరీర్‌పై నీడ వేసే అవకాశం ఉంది.

Similar Posts