బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తగ్గేదేలే అన్నట్లు ముందుకు వెళ్తోంది. గేమ్ ఛేంజర్ సినిమాని కంటిన్యూగా టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant)తో పాటు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై సెన్సేషన్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన ఈ భామ తాజాగా.. మ్ ఛేంజర్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.
రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.
రిలీజ్ మరుసటి రోజు నుంచే కలెక్షన్స్ డ్రాప్ మొదలైంది. నిర్మాత, దర్శకులు ఆ బాధలో ఉంటే ఊర్విశి రౌతేలా మాత్రం తన డాకు మహారాజ్ హిట్ అయ్యిందని, గేమ్ ఛేంజర్ ప్లాప్ అయ్యిందని పదే పదే దెప్పి పొడుస్తోంది.
గేమ్ ఛేంజర్ సినిమాను డిజాస్టర్ అంటూ నోరు జారింది నటి ఊర్వశి రౌతేలా. బాలకృష్ణ డాకు మహరాజ్తో ఇటీవల హిట్టు అందుకున్న ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయ్యిందని.. నేను నటించిన డాకు మహరాజ్ సినిమా సూపర్ హిట్ అయ్యిందని.. ఇందులో నా తప్పులేదని.ఊర్వశి చెప్పుకోచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
ఇదిలా ఉంటే తాజాగా తన ఇనిస్ట్రా ఎక్కౌంట్ లో సినిమా బాగా లేకున్న పెయిడ్ పీఆర్లు చేసిన జనాలు తిప్పికోడతారంటూ మరోసారి గేమ్ ఛేంజర్ సినిమా గురించి గుచ్చి గుచ్చి బాణాలు వదిలిందీ భామ. ఇది టాలీవుడ్ కు షాక్ ఇస్తోంది.