
రెండు క్రేజీ సినిమాలు లైన్‌లో పెట్టుకున్న మోహన్ బాబు!
తెలుగు సినిమా అంటే… డైలాగ్ అంటే… ధాటిగా చెప్పే స్టైల్ అంటే… వెంటనే అందరికీ గుర్తొచ్చే పేరు మోహన్ బాబు. విలన్‌గా గర్జించాడు… హీరోగా దూసుకెళ్లాడు… ఒకప్పుడు సింగిల్ హ్యాండ్‌తో సినిమాలను హిట్ చేసిన నటుడు. కానీ గత కొన్నేళ్లుగా పెద్దగా కనిపించలేదు. మంచి పాత్రలూ వదిలేశాడు. అభిమానులు కూడా “మోహన్ బాబు మళ్లీ ఎప్పుడు?” అని ఎదురు చూశారు.
ఇవిగో… ఇప్పుడు డబుల్ క్రేజీ ప్రాజెక్టులతో మళ్లీ వచ్చేస్తున్నారు!
నానీ ది ప్యారడైజ్ – నానీకి గట్టిగా టఫ్ ఇచ్చే రోల్!
నాని నటిస్తున్న ది ప్యారడైజ్ లో మోహన్ బాబు పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఒదెల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోనే మోహన్ బాబు కోసం ప్రత్యేకంగా భారీ హౌస్ సెట్ వేసారు. సెట్ బడ్జెట్ చూసి యూనిట్‌కి కూడా షాక్!
చరిత్రలో నిలిచిపోయే రేంజ్ రోల్ అంటూ టాక్ ఉంది. ఇందులో నేరుగా నానీతో ఘర్షణ పడే పాత్ర. మోహన్ బాబు కూడా స్క్రిప్ట్ విన్న వెంటనే ఓకే చేశారని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం.
అజయ్ భూపతి శ్రీనివాస మంగాపురం – లో మోహన్ బాబు విలన్‌గా !
‘RX100’, ‘మంగళవారమ్’ చేసిన అజయ్ భూపతి… యాక్టర్ నుండి బీస్ట్ లాంటి పెర్ఫార్మెన్స్ తీసేయడంలో మాస్టర్. ఇప్పుడు అదే డైరెక్టర్ సినిమా శ్రీనివాస మంగాపురం లో మోహన్ బాబు లీడ్ యాంటగనిస్ట్ గా దుమ్మురేపబోతున్నారు.
ఘట్టమనేని జయకృష్ణ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ. ఈ నెలలోనే షూట్ స్టార్ట్. మోహన్ బాబు పాత్ర అంత బలంగా ఉండటంతో విన్న వెంటనే ఒకసారిగా ఓకే చేసిన పాత్ర ఇదే.
రెండు సినిమాలు… రెండు హైప్‌లు… మోహన్ బాబు పూర్తి స్థాయి కంబ్యాక్?
ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక్క మాటే – “మోహన్ బాబు రెండు సినిమాలతో మళ్లీ దుమ్ము రేపబోతున్నాడు!”. 2026లో ఈ రెండు ప్రాజెక్టులు వస్తే మోహన్ బాబు మళ్లీ ఫుల్ బిజీ అవుతాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు.
