సినిమా వార్తలుసోషల్ మీడియా

అదితి తర్వాత… శ్రియ శరణ్ కూ అదే దెబ్బ! ఫేక్ WhatsApp కలకలం

సెలబ్రిటీల పేర్లను దుర్వినియోగం చేస్తూ నకిలీ వాట్సప్ అకౌంట్లు క్రియేట్ చేసి, ఫొటోగ్రాఫర్లు–ఏజెన్సీలను సంప్రదించే ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితమే నటి అదితి రావు హైదరి పేరుతో ఓ వ్యక్తి ఫేక్ WhatsApp ఐడి తయారు చేసి, ఫొటోషూట్ల పేరిట పలువురిని సంప్రదించిన విషయం పెద్ద హడావుడిని సృష్టించింది. ఇప్పుడు అదే వరుసలోకి నటి శ్రియ శరణ్ కూడా చేరిపోయారు!

శ్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నేరుగా అప్రమత్తం చేస్తూ ఇలా చెప్పింది:

“ఈ WhatsApp నంబర్ ఎవరిదో తెలియదు. దయచేసి ఇలా ఉన్న ఫేక్ అకౌంట్లతో మాట్లాడి మీ టైమ్ వృథా చేసుకోకండి. ఇది నేను కాదు, నంబర్ కూడా నాది కాదు. దురదృష్టమేమిటంటే… ఈ వ్యక్తి నా దగ్గరి వారికి, నేను పని చేయబోయే టీమ్స్‌కి మెసేజ్‌లు చేస్తూ ఉంటాడు. అందరూ జాగ్రత్త!”

ఇదిలా ఉండగా, ఇటీవల అదితి కూడా స్పష్టంగా హెచ్చరించింది:

“నా పేరు–ఫొటో పెట్టుకునే ఫేక్ అకౌంట్లు ఫొటోగ్రాఫర్లకు మెసేజ్‌లు చేస్తుంటాయి. ఫోటోషూట్స్‌ కోసం నేను ఎప్పుడూ పర్సనల్ నంబర్స్ వాడను. నా టీమ్‌ ద్వారానే సంప్రదిస్తాను. ఇలాంటి మెసేజ్‌లు వస్తే, వెంటనే మా arhconnect ఇన్‌స్టా ఖాతాకు సమాచారం ఇవ్వండి.”

సెలెబ్రిటీ ఇంపర్సనేషన్ మరింత పెరుగుతోన్న ఈ సమయంలో, “ఏవి నిజం? ఏవి ఫేక్?” అన్న గందరగోళం క్రియేట్ అవుతోంది.
అభిమానులు, ఫొటోగ్రాఫర్లు, ఏజెన్సీలు — అందరూ డబుల్ అలర్ట్!
ఫేక్ WhatsApp, ఫేక్ ప్రొఫైల్… ఈ మోసం ఎక్కడ ఆగుతుంది?

Similar Posts