
‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ
ఇల్లందుకు సమీపంలోని చిన్న ఊరు—అక్కడో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న రాజు (అఖిల్ రాజ్). తన తల్లిదండ్రులు (శివాజీ రాజా – అనిత చౌదరి)తో కలిసి వంశపారంపర్యంగా వచ్చిన బ్యాండ్ మేళాన్ని ఆసరా చేసుకుని బ్రతికేస్తూంటాడు. పండుగైనా… శోకాన్నైనా… రాజు బీట్ వినిపిస్తే గ్రామం ఊపిరి పీల్చుకున్నట్లే.
అదే గూడెంలో మరో సెటప్. ప్రభుత్వ హాస్పిటల్. అందులో క్రమశిక్షణ, మొండితనం, అహంకారం— ఇవి మూడు కలిసి తయారు చేసిన మనిషి వెంకన్న (చైతూ జొన్నలగడ్డ) కాంపౌండర్ గా పనిచేస్తూంటాడు. అతని కూతురు రాంబాయి (తేజస్వినీ).ఆమె ఓ నిశ్శబ్దమైన అమ్మాయి.
రాంబాయి పై రాజు యధావిధిగా మనస్సు పడతాడు. మొదట రాంబాయి వెనుకంజ వేసినా… రాజు ప్రేమలోని స్వచ్ఛత, అతను జీవితాన్ని జీవించే తీరు నచ్చి ప్రేమలో పడుతుంది. అదిగో ఇప్పుడు కథలో అసలు మలుపు—వెంకన్నకు ప్రేమ విషయం తెలిసిపోతుంది. ఈ ప్రేమకు అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు. ఎందుకంటే తన కూతురని ఓ “గవర్నమెంట్ ఉద్యోగి”కే ఇచ్చి పెళ్లి చేయాలన్న అతని ఆలోచన.
దాంతో అతని కోపం రాజుపై ద్వేషంగా మారుతుంది. మరో ప్రక్క రాజుకు ఓ ఐడియా వస్తుంది. తను కనుక..తన గర్ల్ ప్రెండ్ కు కనుక కడుపు చెయ్యగలిగితే…ఆమె తండ్రి చచ్చినట్లు ఒప్పుకుంటాడు. వెంటనే ఆ ప్రేమికులు ఇద్దరూ ఆ ఆలోచనను అమలు పరుస్తారు. ఈ విషయం తెలిసిన ఆమె తండ్రి ఏం చేస్తాడు. ఆ ప్రేమ కథ ఇప్పుడు ఏ టర్న్ తీసుకుంటుంది. అంత హైప్ చేసిన క్లైమాక్స్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
తెలుగులో హానర్ కిల్లింగ్ జానర్ అంటే చాలా చిత్రాలు అంటే పాతబడ్డ డ్రామాలు, రొటీన్ మెసేజ్‌లతో వచ్చేవి. కానీ ‘రాజు వెడ్స్ రాంబాయి’ చూపించే కోణం మాత్రం విభిన్నం.
ఊహించిన ప్రేమకథ… ఊహించని ముగింపు!”
‘రాజు వెడ్స్ రాంబాయి’ తొలి ఫ్రేమ్ నుంచే పల్లెటూరి వాతావరణాన్ని మన ముందు ఉంచుతుంది. గ్రామం, ప్రజల మాట తీరు, బీట్‌లు—అన్నీ కలిసి నిజజీవిత కథలా అనిపించే స్పేస్‌ని తయారు చేస్తాయి. అయితే ఊహించినట్టుగానే సాగతుంది. కొత్త మలుపులు లేకపోయినా, హీరో–హీరోయిన్ కెమిస్ట్రీ, చిన్న చిన్న హాస్య సన్నివేశాలు మొత్తం మొదటి భాగాన్ని సేపు అలా అలా నడిచేలా చేస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ పెద్దగా సర్‌ప్రైజ్ కాకపోయినా,అది తీసుకురాగలిగిన భావోద్వేగం మాత్రం వర్కవుట్ అయ్యింది.
సెకండ్ హాఫ్ ఎమోషనల్‌గా తిరుగుతుంది. కానీ ప్రేమకథలో కొత్త ట్విస్ట్‌లు లేకపోవడం, పాత్రలు పడే కష్టాలు తగినంత తీవ్రంగా చూపించకపోవడం రెండో భాగాన్ని ఊహకు అందేలా చేస్తుంది. ముఖ్యంగా— హీరోయిన్ గర్భవతిగా అవ్వాలని నిర్ణయించే సీన్ స్క్రిప్ట్‌లో బలంగా ఉన్నా, ఆ భావోద్వేగం తెరపై పీక్‌కి చేరలేదు. అక్కడ మరింత రా ఇంటెన్సిటీ అవసరం అనిపిస్తుంది.
విలన్ ట్రాక్: రాంబాయి తండ్రి పాత్రలో వచ్చే బెదిరింపు మొత్తం కథను నడపాలి. కానీ అతని స్క్రీన్ ప్రెజెన్స్ కొన్నిసార్లు మాత్రమే ప్రభావం చూపుతుంది.అతన్ని మరింత శక్తివంతంగా రాసుంటే— సెకండ్ హాఫ్ టెన్షన్ డబుల్ అయ్యేది.
కానీ అసలు మలుపు… క్లైమాక్స్‌లోనే! కథ నిజంగా ఏమిటి? ఎందుకు ఇలా జరిగింది? సినిమా ముగిసే సమయంలో చూపించిన అసలు సంఘటనలు + న్యూస్ పేపర్ కటింగ్స్ ఒక బలమైన షాక్‌ను వదులుతాయి. ఈ ముగింపే సినిమాకు అసలు బలం. మిగతా లోపాలన్నీ మర్చిపోయేలా చివరి క్షణాలు ప్రేక్షకుల మనసులో గాయం మిగులుస్తాయి.
ఎవరెలా చేసారు
అఖిల్ ఉద్దేమారి, తేజస్వి రావు ప్రధాన పాత్రల్లో కనిపించారు. కొత్తవాడు అయిన అఖిల్ చాలా బాగా నటించాడు; అతని టాలెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. తేజస్వి రావు తన పాత్రకు నిజాయితీ, సహజ భావోద్వేగాన్ని తీసుకొచ్చింది. హీరోయిన్ తండ్రిగా చైతూ జొన్నలగడ్డ బాగానే సరిపోయాడు, కొన్ని సీన్లలో బలంగా కనిపించాడు, కానీ అతని పాత్రకు ఇంకా డెప్త్ ఉంటే బెటర్ అయ్యేది. హీరో తల్లిదండ్రులుగా శివాజీ రాజా, అనిత చౌదరి కూడా మంచి ఇంపాక్ట్ చూపించారు.
పాజిటివ్స్:
పర్ఫార్మెన్స్‌లు అద్భుతంగా నెట్టుకెళ్లాయి
భావోద్వేగ సన్నివేశాలు / డైలాగులు ప్రభావవంతంగా పనిచేశాయి
సంగీతం కథనానికి మంచి బలం ఇచ్చింది
హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ గట్టిగా తాకుతుంది
👎 నెగటివ్స్:
సన్నివేశాలు ఎక్కువగా ప్రెడిక్టబుల్‌గా ఉన్నాయి
హీరోయిన్ తండ్రి కెరెక్టర్‌ను బలహీనంగా హ్యాండిల్ చేశారు
కొన్ని చోట్ల కథనం నెమ్మదించి, డల్‌గా అనిపిస్తుంది
చూడచ్చా
ఓటిటిలలో చూడదగిన సినిమా. థియేటర్ లో టైమ్, డబ్బు ఖర్చు పెట్టి క్లైమాక్స్ కోసం చివరిదాకా ఓపిక పెట్టి చూడాలంటే కొంచెం కష్టమే.
