సినిమా వార్తలుసోషల్ మీడియా

డీప్‌ఫేక్స్, బెదిరింపులపై సమంత ఆవేదన… ఐరాసతో హై-లెవల్ మిషన్ ప్రారంభం!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు గ్యాప్ తీసుకున్నా… ఆమె క్రేజ్ మాత్రం సోషల్ మీడియాలో అపారంగా ఉంది. 37 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌తో దేశంలో అత్యంత ప్రభావం ఉన్న యాక్టర్స్‌లో సమంత ఒకరు. ఇప్పుడు అదే సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని – మహిళలపై ఆన్‌లైన్‌ హింసకు వ్యతిరేకంగా గంభీరమైన పోరాటం ప్రారంభించారు!

తాజాగా సమంత ఐక్యరాజ్యసమితి (UN Women India) తో చేతులు కలిపి, ఆన్‌లైన్‌లో మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు ముందుకొచ్చారు. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 10 వరకు జరగనున్న 16 రోజుల అంతర్జాతీయ ప్రచార కార్యక్రమంలో ఆమె భాగమవుతున్నారు.

సమంత ఎమోషనల్ స్టేట్‌మెంట్ – “నేను కూడా ఈ హింసను ఎదుర్కొన్నాను”

37 మిలియన్ల ఫాలోవర్స్‌ కలిగిన సమంత ఇన్‌స్టాలో తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుని షాక్‌కు గురి చేశారు. “మహిళలపై ఆన్‌లైన్‌ కామెంట్స్‌, బెదిరింపులు, డీప్‌ఫేక్‌ ఫోటోలు… ఇవన్నీ ఒక కొత్త రకం హింస. ప్రత్యక్ష హింస స్క్రీన్‌లపైకి మారింది. ఇది మానసికంగా మనిషిని కుంగదీస్తుంది. ఎన్నోసార్లు నేను కూడా దీనిని అనుభవించాను,” అని సమంత భావోద్వేగంగా చెప్పారు.

ఆన్‌లైన్‌ వేధింపులు మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, వారి గళాన్ని అణగదొక్కుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రచారం ద్వారా మహిళల్లో అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

“కఠిన చట్టాలు అవసరం!” – సమంత డిమాండ్

సమంత స్పష్టంగా చెప్పింది: “ఆన్‌లైన్‌ హింసను అరికట్టాలంటే బలమైన వ్యవస్థలు, కఠిన చట్టాలు తప్పనిసరి.” ఐరాసతో (UN Women India) కలిసి పనిచేయడం తనకు గౌరవకరమైన అవకాశం అని సమంత అన్నారు.

స్టార్ పవర్ + సోషల్ ఇంపాక్ట్ = సమంత ఎఫెక్ట్!

టాలీవుడ్‌లో అత్యంత ఇన్‌ఫ్లూయెన్షియల్ నటీమణుల్లో ఒకరైన సమంత ఈ ప్రచారంలో చేరడంతో, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమంపై హ్యూజ్ అటెన్షన్ పడే అవకాశం ఉంది. సినిమా స్క్రీన్‌పై మాత్రమే కాదు… ఇప్పుడు సోషల్ ఇష్యూల్లో కూడా సమంత తన పవర్‌ఫుల్ ప్రెసెన్స్ చూపిస్తున్నారు.

Similar Posts