సినిమా వార్తలు

OTTలు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’కు దెబ్బకొడుతున్నాయా?

ఆంధ్రా కింగ్ తాలూకా పాజిటివ్ రివ్యూలు, మంచి ఫ్యామిలీ టాక్ సంపాదించినా… బాక్సాఫీస్ నందు ఆ హీట్ ఇంకా కనబడటం లేదు.

ఓపెనింగ్ అధికారిక ఫిగర్లు రిలీజ్ కాలేదు కానీ, మొదటి రెండు రోజుల్లో థియేటర్ ఆక్యుపెన్సీ అవెరేజ్ నుంచి బ్లో పార్ వరకే ఉంది.

సాధారణంగా ఇలా టాక్ వచ్చిన సినిమాలు వీకెండ్‌లో వెంటనే లిఫ్ట్ అవుతాయి. కానీ ఆంధ్రా కింగ్ తాలూకా విషయంలో ఆ సడన్ జంప్ కనిపించలేదు. హైదరాబాద్, మల్టీప్లెక్స్ ఏరియాల్లో స్లోగా పెరుగుతోంది. మల్టీప్లెక్స్ బెల్ట్స్‌లో గ్రాడ్యువల్ ఇంప్రూవ్‌మెంట్ ఉన్నాయి…
కానీ ఫ్యాన్స్ ఊహించినంత స్పీడ్ లేదు. అందుకే — శనివారం ఈవెనింగ్, నైట్ షోస్ & ఆదివారం కలెక్షన్స్ — అత్యంత క్రూషియల్.

ఈ రెండు రోజులు పర్ఫెక్ట్‌గా లిఫ్ట్ అయితే సినిమా సేఫ్‌లోకి చేరే ఛాన్స్ ఉంది. అయితే, జంప్ రాకపోతే — బ్రేక్ ఈవెన్ వరకు వెళ్లడం కష్టమే.

అఖండ 2 ఎఫెక్ట్ ఇప్పటికే ప్రారంభమైంది! తర్వాత వచ్చే వారం Akhanda 2 అల్లరి మొదలవుతుంది. గురువారం ఈవెనింగ్ నుంచే మార్కెట్ మొత్తం ఆ దిశలోకి వెళ్తుందని ట్రేడ్ అంచనా.

అఖండ 2 బ్లాక్‌బస్టర్ టాక్ వస్తే? ప్రస్తుతం రన్ అవుతున్న అన్ని సినిమాలకు డైరెక్ట్ షాక్ —ఆంధ్రా కింగ్ తాలూకా సహా. ప్రొమోషన్ మిస్‌టైమింగ్ కూడా కలెక్షన్స్‌ను ప్రభావితం చేసిందా?

ప్రొడ్యూసర్ మాట ప్రకారం —రామ్ పొతినేని & భాగ్యశ్రీ రిలీజ్ మొదటి రెండు రోజుల్లో అమెరికాలో ప్రోమోషన్స్ చేయడం ఇండియా కలెక్షన్స్‌పై ప్రభావం చూపిందని అంటున్నారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ – 30 కోట్లు

ట్రేడ్ అంచనా ప్రకారం సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 30Cr గ్రాస్ అవసరం. అందులో కనీసం సగం ఆదివారం నాటికి వచ్చేస్తే టీంకి రిలీఫ్.

గుడ్ న్యూస్ ఏంటంటే

ఈ వీకెండ్ ఆంధ్రా కింగ్ తాలూకా ఫ్యామిలీ ఆడియెన్స్ ఫస్ట్ ఛాయిస్గా మారింది. మల్టీప్లెక్స్ షోలు అప్‌వర్డ్ మూవ్‌మెంట్ చూపుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ కూడా స్టెబిలైజ్ అవుతున్నాయి.

భారీ సమస్య మరోటి — OTTల సునామీ!

ఈ వారం Family Man 3, Stranger Things 5 plus కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్ లా ఒకేసారి OTTల్లో విడుదల అవ్వడం… థియేటర్లకు భారీ డ్యామేజ్.

ఇప్పటి ప్రేక్షకుడు “జస్ట్ ఓకే గా ఉంది” అనిపించే సినిమాలకు థియేటర్ వెళ్లటం తగ్గించాడు. ఎక్స్‌ట్రార్డినరీ WOM లేకపోతే — వీక్షకుడు “కూర్చుని OTTలో చూస్తా” అనే మూడ్‌లోకి వెళ్తున్నాడు. ఇప్పుడంతా సండే నైట్ మీదే! రామ్ త్వరలో హైదరాబాద్‌కు చేరుతారు. ట్రెండ్ స్ట్రాంగ్ అయితే సక్సెస్ టూర్ కూడా ప్లాన్ చేయవచ్చు.

కానీ ప్రస్తుతం —
మొత్తం భవితవ్యం రాబోయే 24 గంటలపై ఉంది. సండే నైట్ కలెక్షన్స్ ఆంధ్రా కింగ్ తాలూకా భవిష్యత్తుని నేరుగా డిసైడ్ చేస్తాయి. హిట్ రేంజ్‌కు దూసుకెళ్తుందా? లేక Akhanda 2 రాకముందే స్టీమ్ కోల్పోతుందా? అదే మిలియన్ డాలర్ ప్రశ్న!

Similar Posts