సినిమా గాసిప్స్సినిమా వార్తలు

ట్రేడ్ కి షాకిస్తున్న ‘పెద్ది’ డిజిటల్ డిల్?

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ పరిస్థితి చాలా దారుణం. రేట్లు పూర్తిగా పడిపోయాయి… ఎంతో పెద్ద సినిమాలు కూడా “అమ్ముడవ్వడమే కష్టం” అనే స్థితి. ఓటిటిలు ఏమంటున్నాయంటే— “థియేటర్‌లో ఆడితే ఇంత… ఆడకపోతే ఇంతే!” అన్నట్టే స్ట్రిక్ట్ రేంజ్ పెట్టేశారు.

ఫలితం?
మహా మహా స్టార్ హీరోల సినిమాలకే 40 కోట్లు కూడా రాలేని మార్కెట్!
గ్రౌండ్ రియాల్టీ ప్రమాదకరంగా మారిపోయింది.

అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ…
‘పెద్దీ’ మాత్రం ట్రేడ్‌కి షాక్ ఇచ్చింది!
పూర్తి షూటింగ్ కూడా ముగియకముందే OTT డీల్ సెక్యూర్ చేసుకుని,
ఇండస్ట్రీని ఒక్కసారిగా తన వైపుకు ఫోకస్ చేయించింది.

తొలి చిత్రం ‘ఉప్పెన’ తోనే సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు సానా – రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. గ్లింప్స్‌లో చరణ్ బ్యాటింగ్ షాట్ వైరల్… తర్వాత వచ్చిన ‘చికిరి’ పాట దేశవ్యాప్తంగా సంచలనం – ఇలా ఒక్కో కంటెంట్ హిట్ అవుతుండటంతో సినిమా బజ్ ఇండస్ట్రీలో పూర్తిగా మారిపోయింది.

ఇక తాజాగా ‘పెద్దీ’ సినిమా OTT డీల్ గురించి వెలుగుచూసిన సమాచారం ఫ్యాన్స్‌కి మరింత ఎగ్జైట్‌మెంట్ తెచ్చింది.

నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తంతో … ‘పెద్ది’ డిజిటల్ రైట్స్!

ఇన్‌సైడ్ టాక్ ప్రకారం— ‘పెద్ది’ డిజిటల్ రైట్స్ కోసం రెండు ప్రముఖ OTT ప్లాట్‌ఫార్మ్స్ పోటీ పడగా… చివరకు నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తంతో డీల్‌కి ఓకే చెప్పిందట. అందుతున్న సమాచారం మేరకు రూ.130 కోట్లకు పైగా అన్ని భాషల డిజిటల్ రైట్స్. షూటింగ్ పూర్తికాకముందే క్లోజ్ చేసిన అరుదైన OTT డీల్. నెట్‌ఫ్లిక్స్ పాన్-ఇండియా + పాన్-వరల్డ్ రేంజ్‌లో రిలీజ్ ప్లాన్

ఇండస్ట్రీ టాక్ ఏంటంటే—

“చరణ్ మార్కెట్, బుచ్చిబాబు క్రియేటివ్ నేమ్, రెహమాన్ మ్యూజిక్ – ఈ కాంబోను నెట్‌ఫ్లిక్స్ రిస్క్ లా కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌గా చూసింది!”ఈ డీల్‌తో ‘పెద్ది’ రిలీజ్‌కి ముందే డిజిటల్ బిజినెస్ పూర్తవడం ట్రేడ్ సర్కిల్స్‌లో రివరేంజ్ టాక్ గా మారింది.

భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్… అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్స్

ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఏర్పాటు చేసిన భారీ సెట్‌పై ఓ కీలక యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు.

రిలీజ్ డేట్ ఫిక్స్: మార్చి 27, 2026

పెద్దీ వచ్చే ఏడాది మార్చి 27న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Similar Posts