సినిమా వార్తలు

జపాన్‌ను దున్నడానికి “పుష్ప రాజ్” రెడీ!

భారతదేశంలో బాక్సాఫీస్‌ బద్దలు కొట్టిన “Pushpa 2: The Rule” ఇప్పుడు మరో సరికొత్త యుద్ధ రంగంలోకి అడుగుపెడుతోంది. RRR తర్వాత జపాన్‌లో తెలుగు సినిమాల క్రేజ్ ఊహించలేనంతగా పెరిగింది. ఇక ఆ వేడి మీదే అల్లు అర్జున్ మాస్ అటిట్యూడ్ అడుగుపెడుతోంది.

జపాన్ అభిమానులు “Pushpa Raj” స్టైల్‌కి ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ పాగల్ అవ్వడం మొదలైంది. అలాంటి హైప్ మధ్య… ఇప్పుడు అఫీషియల్‌గా టీమ్ ప్రకటించింది —

పుష్ప 2 – జనవరి 16, 2026న జపాన్‌లో గ్రాండ్ రిలీజ్!

మేకర్స్ జపనీస్ ఫ్యాన్స్‌కు ప్రత్యేక సందేశంతో ప్రకటించారు: “Konnichiwa, Nihon no Tomo yo!” అంటే… “హలో జపాన్ ఫ్రెండ్స్!” ఈ ఒక్క లైన్‌తోనే జపనీస్ సోషల్ మీడియాలో పుష్ప 2 పేరు వైరల్. టీమ్ స్పష్టంగా చెప్పింది —
“Pushpa Raj will take over Japan on January 16, 2026.”

జపాన్ రిలీజ్‌కు కారణం? కథలోనే జపాన్ కనెక్షన్!

పుష్ప 2లో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ — హీరో మాస్ ఇంట్రడక్షన్ సీన్ — అదీ జపాన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండటంతో, అక్కడి ప్రేక్షకులతో కనెక్షన్ మరింత స్ట్రాంగ్ అవుతోంది. ఇది సాధారణ పాన్-ఇండియా రిలీజ్ కాదు… కథతోనే జపాన్‌ను కలిపిన అరుదైన తెలుగు సినిమా.

జపాన్ పోస్టర్ ఫుల్ వైరల్ – ‘Pushpa Kunrin’ హవా

కొత్తగా రిలీజ్ చేసిన జపనీస్ పోస్టర్‌లో: అల్లు అర్జున్ తన ఐకానిక్ స్టైల్‌లో జీప్‌పై రాజలా కూర్చొని వెనుక ఎర్ర జెండాలు ఎగురుతుండగా
ట్యాగ్‌లైన్ : “I’ll be the King of the Underworld!”

జపాన్ టైటిల్: “Pushpa Kunrin”
పోస్టర్ చివర: “From India to Japan – A Global Scale Dynamic Action Blockbuster.” ఈ లైన్‌తో అక్కడే సోషల్ మీడియాలో కోలాహలం మొదలైంది.

జపాన్‌లో పుష్ప 2 – ఏమవుతుంది?

ట్రేడ్ వర్గాల అంచనా:
ఈ జనవరిలో జపాన్ థియేటర్లు పుష్ప స్టైల్‌లో హోరెత్తబోతున్నాయి. RRR చేసిన రికార్డుల తర్వాత, Pushpa 2 అక్కడ మరో ఇండియన్ సినీ సునామీ అయ్యే ఛాన్స్ 100%!

Similar Posts