సినిమా వార్తలు

“నన్నే ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు?” – కృతి కన్నీళ్ల వెనుక షాకింగ్ నిజం!

సక్సెస్ వచ్చినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు.
ఫెయిల్యూర్ వచ్చినప్పుడు?
అదే చేతులు రాళ్లు విసురుతాయి.

తెలుగు సినిమా ప్రేక్షకులు ఇష్టపడిన ఆ అమాయక ముఖం… “ఉప్పెన”తో ఒక్కసారిగా స్టార్ అయ్యింది. కానీ కొన్ని సినిమాలు తర్వాత సినిమాలు వర్కవుట్ కాలేదు అనగానే ఆమెపై బాణాలు, మీమ్స్, కామెంట్లు…

“ఎవరు తప్పు చేసినా నింద మాత్రం కృతికే!”

అదే అమ్మాయి ఇప్పుడు కన్నీళ్లతో అంటుంది —
“నన్ను అన్యాయంగా బ్లేమ్ చేశారు.”

ఇక్కడే కథ మొదైంది.

అసలేం జరిగింది?

కృతి శెట్టీకి సక్సెస్ రాక Rocket లా వచ్చింది. “ఉప్పెన” తర్వాత వరుస ఆఫర్లు, స్టార్ ట్రీట్‌మెంట్, అమ్మాయి పేరు ఇండస్ట్రీలో ట్రెండింగ్. కానీ రెండో సినిమా… మూడో సినిమా… ఎనర్జీ, ఎఫర్ట్ పెట్టినా అదే మ్యాజిక్ రిపీట్ కాలేదు.

అక్కడినుంచి రూమర్స్, విమర్శలు, బ్లేమ్ గేమ్ మొదలైంది. ప్రతి ఫెయిల్యూర్‌కి బాధ్యత మొత్తం ఆమె మీద పడింది.

“ఎందుకు నన్నే?” – భావోద్వేగ క్షణం

కొత్త సినిమా ప్రమోషన్స్‌లో కృతి నవ్వుతూ మాట్లాడుతోంది. కానీ ఇంటర్వ్యూలో ఒక్క ప్రశ్న వచ్చింది: “ఫెయిల్యూర్ తర్వాత వచ్చిన ట్రోల్స్ గురించి?”

ఆ నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది.

చిన్న విరామం… ఆమె గొంతు అడ్డం పడింది.

“చిన్న వయసులో చాలా కష్టాలు చూశా. సినిమాలు వర్కవుట్ కాకపోయినా ఆ నింద మాత్రం నాకే వచ్చింది. ఎందుకు? అది నా చేతుల్లో ఏమీ లేదు కదా.”

ఆమె కళ్లలో బాధ స్పష్టంగా కనిపించేది.

“హేట్ ఆన్లైన్‌లో రావడం… నిజంగా భరించలేకపోయాను.”

ఒక మాటలో —
స్టార్డమ్ ఎంత మధురమో, అంతే cruel.
కంబ్యాక్‌లో అసలు కథ

అవకాశాలు తగ్గినప్పుడు కృతి ఆగలేదు. దిశ మార్చింది. తమిళంలో వరుస సినిమాలు! ఇప్పుడు కార్తి హీరోగా “Vaa Vaathiyaar”
తెలుగులో “అన్నగారు వస్తారు” డిసెంబర్ 12 రిలీజ్. ప్రొమోషన్స్‌లో ఆమెకున్న కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది.

“నా బెస్ట్ ఫేజ్ ఇంకా ముందుంది,” అంటోంది 22 ఏళ్ల కృతి – కళ్లలో ఒక ఫైర్‌తో.

స్టార్డమ్ unpredictable…
కాని కృతిలో ఒక certainty ఉంది: కంబ్యాక్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది.

Similar Posts