
అన్నపూర్ణ స్టూడియో… బంజారాహిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీకి?
ఫ్యూచర్ సిటీలో మొదలైన తెలంగాణ రైజింగ్ సమ్మిట్… ఓ స్టాల్ నుంచి మరో స్టాల్ వరకు కెమెరాలు, ఫ్లాష్ లైట్లు… మధ్యలో చిరునవ్వుతో నడిచింది ఒక పేరు – నాగార్జున. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి, ముఖ్యమంత్రితో పక్కపక్కన నిల్చున్న నాగార్జున ఒక్క మాట అన్నప్పుడుఅక్కడ ఉన్న వారంతా ఒకే ఆశ్చర్యపోయారు.
“అన్నపూర్ణ స్టూడియో ఫ్యూచర్ సిటీకే వస్తుందా?”
ఏమైంది? ఏమంటున్నారు?
స్టాల్స్ పరిశీలిస్తుండగానే నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు: “ఇక్కడ ఫిలిం హబ్ ప్లాన్ జరుగుతోంది… అన్నపూర్ణ స్టూడియోస్ ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకురావచ్చు.”
సమ్మిట్ గురించి, ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ గురించి ఆయన బాగా పొగిడారు. ఇది అందుకు మించి పెద్ద సూచనలా కనిపించింది.
కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది…
కొత్తగా స్టూడియో కడతారా?
లేక బంజారాహిల్స్ నుంచి పూర్తిగా తరలిస్తారా?
అది క్లియర్ కాదు.
బంజారాహిల్స్‌లో స్టూడియో నిర్మించినప్పుడు అది కొండలు, గుట్టలు… కష్టాల మీద కష్టాలు. ఇప్పుడు? అది హైదరాబాద్లో అత్యంత బిజీ, అంతకు మించి అత్యంత ఖరీదైన ప్రాంతం.ఆ ప్రాంతానికి వేల కోట్ల విలువ!
హిల్ట్ పాలసీ, రియల్ ఎస్టేట్, వ్యాపారి నాగార్జున
హిల్ట్ పాలసీ ప్రకారం స్టూడియోకి కేటాయించిన భూమి స్టూడియోకే వినియోగించాలి. అంటే… అక్కడ షాపింగ్ మాల్స్, హోటల్స్, రియల్ ఎస్టేట్… అలా కుదరదు. కానీ… ప్రభుత్వం పాలసీ మార్చితే? స్టూడియోను శివార్లకి తరలిస్తే? బంజారాహిల్స్‌లో ఆ ల్యాండ్ మీద హోటల్స్, రియల్ ఎస్టేట్, బిజినెస్ బూమ్!
ఇక్కడే బిజినెస్ స్మెల్ ఉంది.
నాగార్జునలో పర్ఫెక్ట్ వ్యాపారి ఉన్నారు. సినిమా వైపు, స్టూడియో వైపు, రియల్ ఎస్టేట్ వైపు… ఏ నిర్ణయం అయినా తీసుకోగలరు. ఫ్యూచర్ సిటీలో అన్నపూర్ణ స్టూడియో… ఇది ఒక సాధారణ షిఫ్ట్ కాదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మ్యాప్ మార్చే డిస్కషన్.
ముందు రోజుల్లో అసలు డీల్ ఏంటో బయటకు వస్తుంది. ప్రస్తుతం మాత్రం… ఫ్యూచర్ సిటీలో నాగార్జున ఒక మాటతో సిటీలో హాట్ టాపిక్ ఒక్కటే: “అన్నపూర్ణ స్టూడియో తరలింపేనా?”
