సినిమా వార్తలు

“ఉస్తాద్” రిలీజ్ సౌండ్… చరణ్ ఫ్యాన్స్ కు ఎందుకు అసహనం ?

తెలంగాణ, ఆంధ్రలోని థియేటర్లలో వచ్చే మార్చ్ నెల అంటే సమ్మర్ + సెలవులు + ఫ్యామిలీ అవుటింగ్స్… సినిమాలకి జాక్‌పాట్ టైమ్. అలాంటి తేదీ కోసం ఒకేసారి మూడు భారీ సినిమాలు నిశ్శబ్దంగా పోటీ పడుతున్నాయి.

ఇదే పోటీ ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ అయింది!

ఉస్తాద్ ప్రమోషన్స్ స్టార్ట్… కానీ రిలీజ్ డేట్ మిస్టరీ

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే మేకర్స్ డిసెంబర్ 9న ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పడంతో ప్రమోషన్స్ వేగం పెరిగింది.

ఇక్కడికీ ఓకే.

కానీ… ఇండస్ట్రీలో ఒక్క మాట మాత్రం బాగా వినిపిస్తోంది: “ఉస్తాద్ మార్చ్ లోకి వస్తుంది!”

అదే మార్చ్ లో రామ్ చరణ్ “పెద్ది” కూడా వచ్చేందుకు సిద్ధం! ఈ మాటే ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ ని ఆగ్రహపెడుతోంది.

Peddi vs Ustaad… ఎవరికి మార్చ్ జాక్‌పాట్?

మొదట:

చరణ్ పెద్ది
నాని ది ప్యారడైజ్

ఇద్దరూ మార్చ్ ఎండ్ రిలీజ్ అని ప్రకటించారు.

కానీ షూట్ డిలే కావడంతో, The Paradise పోస్ట్‌పోన్ అవుతున్నట్టు టాక్. కొత్త డేట్ త్వరలో వస్తుంది.

ఇదే సమయంలో మరో బజ్:

పెద్ది షూట్ కూడా జనవరి వరకూ కొనసాగొచ్చు… కాబట్టి అది కూడా తేదీ మారొచ్చు!

అంటే?

“పెద్ది పోస్ట్‌పోన్ అయితే… ఉస్తాద్ అదే డేట్‌లోకి వస్తాడా?” ఇండస్ట్రీలో ఇదే వార్త బిగ్ నాయిస్ చేస్తోంది. కొంత మీడియా ఇక డైరెక్ట్‌గానే చెబుతోంది:

“పెద్ది ఫోస్ట్ పోన్ 100% కన్ఫర్మ్! అని ఆ డేట్ నే ఉస్తాద్ భగత్ సింగ్ తీసుకోబోతోంది.

చరణ్ ఫ్యాన్స్ ఎందుకు హర్ట్ అవుతున్నారు?

చరణ్ ఫ్యాన్స్ కి నిరీక్షణ చాలా ఉంది. పెద్ది తో మ్యాసివ్ కంబ్యాక్ . మార్చ్ అంటే సూపర్ హిట్ సీజన్. ఒక్కరోజు కూడా పోస్ట్‌పోన్ కావద్దు అనేది వారి ఫీలింగ్. దాంతో ఈ ఉస్తాద్ బజ్ వాళ్లను అసహనానికి గురి చేస్తోంది.

వాళ్ల మాట స్పష్టం:

“ పెద్ద మార్చ్ లో ఉండాలి.” “ఇంకో సినిమా కోసం బ్లాక్‌బస్టర్ డేట్ వదలొద్దు.”

మరి నిజంగా పెద్ది డేట్ మారుతుందా? ఉస్తాద్ అదే తేదీని తీసుకుంటాడా? లేదా ఇవన్నీ కేవలం బజ్ మాత్రమేనా?. రాబోయే రోజుల్లోనే మొత్తం క్లారిటీ వస్తుంది. కానీ ఇప్పటి వరకూ… నాయిస్ మాత్రం పీక్ లెవెల్లో ఉంది!

Similar Posts