సినిమా వార్తలు

జపాన్‌లో భూకంపం – ప్రభాస్‌ ఎలా ఉన్నారు,టెన్షన్ ?!

జపాన్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించిన వార్త బయటకు రావడంతో… “ప్రభాస్ సేఫ్‌గా ఉన్నాడా?” అనే ఒక్క ప్రశ్నతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కలవరపడ్డారు. తీవ్రత 7.6 గా నమోదైన ఈ కంపనం అక్కడి ఉత్తర తీరాన్ని కుదిపేసింది. సునామీ వార్నింగ్స్ రావడంతో పరిస్థితి సీరియస్‌గా మారింది.

అందులో ముఖ్యంగా — ప్రభాస్ ఇదే టైమ్‌లో జపాన్‌లోనే ఉండటం ఫ్యాన్స్‌లో అసలు టెన్షన్‌కు కారణమైంది.

ఎందుకు టెన్షన్?

“బాహుబలి – ది ఎపిక్” జపాన్‌ స్పెషల్ రిలీజ్ ఈ నెల 12న జరగనుంది. దాని ప్రమోషన్స్ కోసం ప్రభాస్ కొన్ని రోజులుగా అక్కడే ఉన్నారు.
అభిమానులను కలుస్తూ, ఈవెంట్స్‌కి హాజరవుతూ బిజీగా ఉన్నాడు.

అలాంటి సమయంలో భూకంపం రావడంతో సోషల్ మీడియా మొత్తం ‘ప్రభాస్ ఎక్కడ?’, ‘సేఫ్‌గా ఉన్నాడా?’ అంటూ క్వశ్చన్స్‌తో నిండి పోయింది.

రీలీఫ్ ఇచ్చిన మారుతి!

డైరెక్టర్ మారుతి వెంటనే స్పందించాడు. అతడు ప్రభాస్‌తో మాట్లాడినట్టు చెబుతూ, “ప్రభాస్ పూర్తిగా సేఫ్. ఆయన టోక్యోలో లేరు. టెన్షన్ అవసరం లేదు.” అని క్లారిటీ ఇచ్చాడు.

ఈ మెసేజ్‌తో ఫ్యాన్స్‌కు పెద్ద ఊరటనిచ్చాడు. కొద్ది గంటలుగా అల్లాడుతున్న అభిమానులు వెంటనే రీలీఫ్ అయ్యారు.

క్రేజ్ అదే రేంజ్!

ఒక భూకంపం వార్త… ఒక్క క్షణంలో ప్రభాస్ పేరు ట్రెండ్ అయ్యేంత పాపులారిటీ —అదే స్టార్‌డమ్! ఇప్పుడు జపాన్‌లో ప్రమోషన్స్…
డిసెంబర్ 12న స్పెషల్ రిలీజ్…

మరలా “బాహుబలి” మ్యాజిక్ రిపీట్ అవుతుందా? అంతా ఇదే ప్రశ్న!

Similar Posts