సినిమా వార్తలు

‘అఖండ 2’ హైకోర్టు ఆర్డర్లపై గందరగోళం… కానీ ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నల్!

చివరి నిమిషంలో వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, కోర్టు ఆర్డర్లు, సోషల్ మీడియాలో పుట్లకట్టిన రూమర్లు… ఇవన్నీ ‘అఖండ 2’ విడుదలపై మళ్లీ సందేహాలను రేకెత్తించాయి.
“ప్రీమియర్లకు మళ్లీ అడ్డంకులా?”
“ఈ రాత్రి షోలు క్యాన్సల్ అవుతాయా?”
అంటే ఇలాంటివే ప్రశ్నలు ఫ్యాన్స్‌లో టెన్షన్ పెంచాయి.

కానీ ఇప్పుడు మేకర్స్ ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చారు — “అన్నీ ట్రాక్‌లోనే ఉన్నాయి… ఈ రాత్రి గ్రాండ్ ప్రీమియర్స్ 100% జరుగుతాయి!”

ఇలా అధికారిక ప్రకటన రావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

మేకర్స్ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ – ‘రూమర్లు నమ్మొద్దు’

తెలంగాణ హైకోర్ట్ తాజా ఆదేశాల నేపథ్యంలో సోషల్ మీడియాలో “ప్రీమియర్లు ఆగిపోయాయి” అంటూ రూమర్లు హడావుడి చేశాయి.
అయితే 14 Reels టీమ్ వెంటనే స్పందించి ఇలా స్పష్టం చేసింది:

“అఖండ 2 ప్రీమియర్స్‌పై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సినిమా ప్రీమియర్లు ఈ రాత్రే గ్రాండ్‌గా జరుగుతాయి.”

ఈ అధికారిక అప్డేట్ వెంటనే వైరల్ అవుతూ, మొత్తం హైప్‌ను మళ్లీ పీక్‌కు తీసుకెళ్లింది.

ఇక బుకింగ్స్ విషయానికొస్తే —
ప్రీమియర్ షోలు దాదాపు ఫుల్
జనం పెర్ఫెక్ట్ మాస్ మోడ్‌లో
ఫస్ట్ డే ఓపెనింగ్‌పై భారీ అంచనాలు

అఘోర అవతారంలో బాలయ్య – ఈ రాత్రే తాండవం!

ఫ్యాన్స్ ఏం కోసం ఎదురుచూస్తున్నారు?
బాలయ్య అఘోర అవతారం.
బోయపాటి స్టైల్ ఆధ్యాత్మిక యాక్షన్.
థియేటర్ షేక్ చేసే మాస్ సీన్స్.

ఇవే ‘అఖండ 2’ను ఈ రాత్రి ప్రీమియర్స్ నుంచే భారీ ఓపెనింగ్ వైపు నడిపిస్తున్నాయి.

అభిమానుల మాటల్లో —
“ఈ రాత్రే నిజమైన అఖండం మొదలవుతుంది!”

అన్ని రూమర్లకు ముగింపు పలుకుతూ, సినిమా టీమ్ ఇచ్చిన ఆల్ క్లియర్‌తో,
‘అఖండ 2’ ప్రపంచవ్యాప్తంగా తాండవం చేయడానికి సిద్ధమైంది!

Similar Posts