సినిమా వార్తలు

‘అఖండ 2’ షాక్ తర్వాత… బోయపాటి నెక్స్ట్ స్టెప్ ఏంటి?

బోయపాటి శ్రీను అంటే మాస్‌కు గ్యారంటీ డైరెక్టర్ అనే ఇమేజ్ ఇప్పటివరకు బలంగా ఉంది. కానీ ‘అఖండ 2’ కలెక్షన్స్ అనుకున్న స్థాయిలో రాకపోవడం, ట్రేడ్‌లో ఒక కీలక ప్రశ్నను లేవనెత్తుతోంది. ఇది కేవలం ఒక సినిమాకే పరిమితమా? లేదా బోయపాటి కెరీర్‌పై ప్రభావం చూపే టర్నింగ్ పాయింటా? బాలకృష్ణ – బోయపాటి కాంబోకి ఉన్న హైప్‌తో పోలిస్తే, బాక్సాఫీస్ రిజల్ట్ తగ్గిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో బోయపాటి నెక్ట్స్ ఏమిటి? ఏ హీరోతో చెయ్యబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

‘అఖండ 2’ తర్వాత నందమూరి బాలకృష్ణ వెంటనే గోపీచంద్ మలినేని సినిమాతో బిజీ అయిపోయారు. అంటే బాలయ్య మాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ స్టెప్ వేసేశారు.
అయితే అసలు ప్రశ్న – బోయపాటి శ్రీను నెక్స్ట్ ఎవరితో?

టాలీవుడ్ టాప్ హీరోలంతా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఎవరి డేట్స్ అందుబాటులేరు. ఎవరితో ముందుకు వెళ్లాలన్నా కనీసం ఒక సంవత్సరం టైమ్ పడే పరిస్థితి.

Allu Arjun Option: మళ్లీ ‘సరైనోడు’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

ఇలాంటి పరిస్థితుల్లో కాస్త అందుబాటులో ఉన్న హీరోగా వినిపిస్తున్న పేరు – అల్లూ అర్జున్. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న బన్నీ, అది త్వరగానే పూర్తయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. దాని తర్వాత బోయపాటితో బన్నీ వర్క్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరైనోడు’ అప్పట్లో సూపర్ డూపర్ హిట్. అంతేకాదు, ఆ సినిమా అప్పటి వరకు బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్.

అదే కాంబో మళ్లీ సెట్ అయితే?
ఖచ్చితంగా బోయపాటికి మళ్లీ ఫుల్ ఫోకస్ వస్తుందన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం.

గీతా ఆర్ట్స్ లింక్ … ఈజీగా సెట్ అయ్యే కాంబో?

ఇన్‌సైడ్ సమాచారం ప్రకారం, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమా చేయడానికి బోయపాటి ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నారట. దీంతో అల్లూ అర్జున్ – బోయపాటి కాంబినేషన్ సెట్ కావడం పెద్ద కష్టం కాదని టాక్. ముఖ్యంగా, ‘అఖండ 2’ తర్వాత బోయపాటి కూడా బన్నీతో మళ్లీ పని చేయాలనే ఆసక్తి చూపిస్తున్నారని, అందుకోసం ఓ కథ కూడా రెడీగా ఉందని వినిపిస్తోంది.

బోయపాటి ఫ్యూచర్‌పై క్లారిటీ అప్పుడే?

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, సంక్రాంతి తర్వాత బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ‘అఖండ 2’ ఫుల్ రన్ ఎలా ముగుస్తుందన్నదీ కీలకం.

‘అఖండ 2’ ఫలితం బోయపాటి కెరీర్‌ని మార్చుతుందా?

మొత్తంగా చూస్తే, ‘అఖండ 2’ బాక్సాఫీస్ రిజల్ట్ బోయపాటి కెరీర్‌లో ఓ హెచ్చరికగా మారింది. ఇప్పటి వరకు మాస్ ఫార్ములాతో నడిచిన ఆయన, ఇప్పుడు కాంబినేషన్ & కంటెంట్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Similar Posts